సాయి కథలు - మురళీధరుడే సాయినాథుడు !
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - మురళీధరుడే సాయినాథుడు !
నేడు శ్రీకృష్ణాష్టమి
" ఒంగోలు లోని శ్రీమతి సీతారామ్మూర్తిగారు కృష్ణభక్తురాలు. సత్సంగాలలో పాల్గొనుచు మంచి అనుభవాల పొందియున్నారు. ఆమె " శ్రీ సాయి లీలామృతము " చదివి , సాయి శ్రీకృష్ణుడుగా దర్శనమివ్వలేదని అనుకొన్నారు. నాటి సాయంత్రం వారి పూజలోని బాబా పటం కృష్ణవర్ణంగా (నీలిరంగుగా) మారిపోయింది. పూజలో లోపంవలన అలా జరిగిందేమోనని ఆమె భయపడుతుంటే నాటిరాత్రి సాయి కలలో కన్పించి , " నేను వస్తే భయపడతావేమి? నా తలపై మూడు పువ్వులుంచి పూజచేయి, రేపు వెళతాను" అన్నారు. ఆమె అలానే చేసారు. నాటి సాయంత్రానికల్లా బాబా పటం మాములుగా వచ్చేసింది1 సాయికి వారిపటానికి , కృష్ణునికీ తేడాలేదు.శ్రీ సాయి లీలామృతము: పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ
బూటీవాడలో మురళీధరవిగ్రహాన్ని స్థాపింపదలచిన స్థానంలో సాయిబాబా దేహాన్ని సమాధిజేశారు, సాయియే మురళీధరుడు!
" కోటిరూపులవాడు, నీలికన్నులవాడు, బూటిమందిరమున మురళిధరుడు వాడు."
ReplyDelete