సాయి కథలు - విజయదశమి, సీమోల్లంఘనము " మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి చరిత్రము
నేడు విజయదశమి, పవిత్రమైన పర్వదినము విజయానినికి, వేడుకలకు సంకేతము. సీమోల్లంఘనమనగా సీమ హద్దులదాటి వెడలి విజయంతో మరలి వచ్చుట. విజయదశమినాడు బాబా మహాసమాధి చెందిన విషయం అందరికీ తెలిసినదే. ఆరోజున బాబా తమదేహ సరిహద్దులదాటి ఎచటికో వెళ్లి మరలా సదా చైతన్యవంతులై , జాగరూకులై మరణంపై గెలుపునొంది తమభక్త హృదయసీమలలోకి ప్రవేశిస్తున్నారు. ఈరోజువరకు సాయిభక్తులకు నిత్యం కలిగే యనుభవాలే యిందులకు నిదర్శనము.
విజయదశమి శుభసందర్భమున శ్రీ సాయి జీవితచరిత్రలో చెప్పబడిన సీమోల్లంఘన వివరములు స్మరించుకొని బాబా ఆశిస్సులు పొందెదముగాక! 1916వ సంవత్సరము విజయదశమి సాయంత్ర సమయాన పెక్కుమంది శిరిడీ గ్రామప్రజలు సామూహికంగా పూజాద్రవ్యాలు తీసుకొని , మేళతాళాలతో ఊరి పొలిమేరకువెళ్ళి సీమోల్లంఘనము పూజజేసి వస్తున్నారు. రాజులు పూర్వం ఆరొజు దిగ్విజయానికి బయలుదేరి పొలిమేరలు దాటేవారని చెబుతారు. ప్రజలు తమతమ గత ద్వేషభావాలమరచి, పరస్పర మైత్రి పెంపొందించుకొంటారు. సీమోల్లంఘనముజేసి అందరూ తిరిగివచ్చుచుండగా సాయిబాబా మిగుల కోపితులై తమ తలరుమాలు, కఫ్ని , లంగోటా తీసి ధునిలో విసరివేసి నిప్పుకణాల లాంటి కళ్ళతో ద్వారకామాయిముందు దిగంబరులై నిలబడ్డారు. దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు. " మూర్ఖులారా! నేను హిందువునో ముస్లింనో యిపుడు తేల్చుకోండి. " యంటూ మిగుల కేకలేశారు. భయపడి అందరూ నలుచెరగులా పరుగులెత్తారు. తుదకు కుష్టురోగి భాగోజీ ధైర్యంజెసి వారి నడుముకు లంగోటాచుట్టి, " బాబా శుభమాయని సీమోల్లంఘనం జరుగుతుంటే మీరేల భక్తుల భయపెడుతున్నారు? " అన్నాడు. కాని సాయిబాబా సట్కా నేలకేసి కొడుతూ, " ఈదినమే నాసీమోల్లంఘనం! " అని కేకలేశారు. ఆమాటలెవరికీ అర్ధం కాలేదు. ఆరోజు చావడి ఉత్సవం జరుగదని భక్తులు తలచారు. కాని కొంతసేపటికి బాబా శాంతించి, బట్టలు ధరించి తమ ఆసనంపై కూర్చున్నారు. రాత్రి 11 గంటలకు జరిగిన చావడి ఉత్సవంలో మామూలుగా పాల్గొన్నారు. ముందుగా సూచించిన ఆవిధంగా 1918 విజయదశమి రోజున బాబా తమ భౌతికదేహరూప సీమదాటి అనంతవ్యాపక నిర్గుణ దివ్యరూపం ధరించి తమభక్తుల నుద్ధరిస్తున్నారు. సమర్ధ సద్గురు శ్రీసాయినాథ్ మహారాజ్ కు మిగుల జయజయ కారాలు పలికెదము!
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like. ( మీ సలహా మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో పంచుకోండి. )
శ్రీసాయినాథాయనమః సాయి బోధ - ఈశోపనిషత్తు దేహ ఆరోగ్యానికి, పోషణకు, ఎదుగుదలకు ఆహారపువిలువలతోకూడిన పౌష్టిక ఆహారము మిక్కిలి ఆవశ్యకము. అలాగే తిన్నటువంటి ఆ ఆహారమును బాగుగా జీర్ణించుకొనవలెను, లేనియెడల అజీర్ణవ్యాధిచే ఆరోగ్యసమస్యలు తలెత్తవచ్చును. ఇదేవిధంగా పుస్తక లేక గ్రంథపఠనముకూడ. చదివిన మంచి విషయముల భావమునెఱిగి తదనుగుణంగా ఆచరించినయెడల ప్రయోజనముంటుందికాని, కేవలం అర్ధం తెలియని పఠనం వ్యర్థం, పైపెచ్చు యెంతో తెలుసుననెడి గర్వం తలెత్తే ప్రమాదముంది. సరిగ్గా దీనిని పోలిన ఓ సంఘటన శ్రీసాయి సచ్చరిత్రములో చూడగలము. దాసగణు మహరాజు, గొప్పసాయి భక్తుడు, కీర్తనకారుడు. ఓ పర్యాయం యితడు సంస్కృత భాషలోని ఈశావాస ఉపనిషతును మరాఠీభాషలోని ఓవీ ఛందస్సులోనికి అనువదించాడు. (గ్రంధంలో ఆత్మ తత్వముగూర్చి వివరింపబడినది.) కాని ఆ ఉపనిషత్తులో చెప్పబడిన విషయ సారాంశము వానికి సరిగా బోధపడలేదు, పండితులతో చర్చించినప్పటికి సరియైన సమాధానం లభింపకపోవుటచే ఆత్మసాక్షాత్కారము పొందిన సద్గుఫు సాయినాథుని దర్శించి తన సమస్యను వివరించి వివరణకై వేడుకొన్నాడు. బాబా వాని నాశీర్వదించి యిట్లన్నార...
శ్రీసాయినాథాయనమః.సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము. పాఠక భక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు,సదా బాబా ఆశీసులు! సమర్ధసద్గురు శ్రీసాయినాథులకు శతకోటి హృదయపూర్వక నమస్కారములతో ఈ వ్యాసమును ప్రారంభిస్తున్నాను. బాబా దయవలన గత కొన్ని సంవత్సరములుగా శ్రీసాయి సచ్చరిత్ర నిత్యపారాయణము విధిగా జరుగుచున్నది. చదివిన ప్రతిసారి కొత్త కొత్త అర్ధాలు,సందేశాలు స్ఫురణకు రావడం గమనించాను. చదివిన మొదట్లో బాబా లీలలు భక్తుల బాధానివారణ కన్నట్లు తలచేవాడను. పారాయణము కొనసాగేకొలది లీలల వెనుక బాబా మనకేదో సందేశమిస్తుంన్నారనే భావన కలుగ సాగింది. లోతుగా చదివిన పిమ్మట నిగూఢసందేశాల జాడ కొద్ది కొద్దిగా అవగాహన కొచ్చెడిది. అధ్యాయ క్రమంలో ఆయా లీలాసందేశాల సమాహారమే ప్రస్తుత సాయిసందేశామృతము. పాఠక భక్తులకు పారాయణానంతరము సాయిలీలల వెనుక వేరువేరు అర్ధములు,భావములు గోచరించుట సహజము. ప్రస్తుతం నా జ్ఞానపరిధికందిన భావాలను తోటి సాయి భక్తులతో పంచుకుంటున్నాను. ఇది పూర్తిగా వ్యక్తిగత భావన. భక్తులెల్లరు తమతమ సూచనలను,స్పందనను క్రిందనున్న...
విజయదశమి సంకల్పం, " మంచిని పెంచుదాం - మనసుల గెలుచుదాం! "
ReplyDelete