Posts

కల్పతరు.

Image
శ్రీసాయినాథాయనమః!నేడు శ్రీస్వామివివేకానంద జయంతి! Happy Youth Day. " భగవంతుడు సర్వ జీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు. తానే పంచభూతాలై తననుండి జీవులందరికీ దేహాలు, పోషణ యిచ్చి తల్లి అయ్యాడు. వేదాలు మొదలుకొని సర్వ శాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. సకల సృష్టినీ తన అధీనంలో ఉంచుకోవడం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు. మహనీయుల రూపంలో అవతరించి గురువయ్యాడు. భూమిమీద తన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినపుడు తననాశ్రయించిన వారందరికీ కల్పవృక్షము, కామధేనువు,చింతామణి అవుతాడు." శ్రీసాయి లీలామృతము. శ్రీసాయిసచ్చరిత్ర గ్రంధంలో సాయిబాబాను ఆశ్రితుల కోర్కెలదీర్చెడి కల్పతరువుగా రచయిత హేమాద్రిపంతు వర్ణించాడు. వివిధ కోర్కెలతో బాబాను చూడవచ్చినవారలగూర్చి, అలా వచ్చుట సబబా యన్న ఓ భక్తునితో బాబా, " మొదట అందరు అలానేవస్తారు, ఓ స్థాయిచిక్కినపిమ్మట నా మార్గంలో నడుస్తారు." యని అన్నారు. బాబా వివిధ భక్తుల బాధలను అవసరాలను దీర్చెడివారు. అన్నవస్త్రాల గూర్చెడివారు, రోగనివారణ జేసెడివారు, సంతాన సౌభాగ్యములు ప్రసాదించెడివారు. సత్వగుణముల పెంపొందించి చక్కటి నడవడి నేర్పెడివారు. అజ్ఞ...

" The Divinity is within you."

Image
Sree Sainathayanamah! Wishing the readers a Merry Christmas. Once Jesus was asked, when the kingdom of God would come? Jesus strikingly said," Neighter here nor there, behold the kingdom within you." Luke 17-21. Shirdi Saibaba used to say that He lives in the hearts of one and all. Innumerable experiences of devotees bear testimony to this fact. Saibaba is the Universal Conciousness. Saibaba said," You need not go in search of Me. Barring your name and form, there exists in you as well as in all beings, a sense of being or Conciouness of Existence. That is Myself. Knowing this, you see Me inside your self, as well as in all beings. If you practise this , you will realize all-pervasiveness, and thus attain oneness with Me." ( Sri Saisatcharita:43-44). Bhagavan Ramana Maharshi reiterated,preached the above truth.His method is about the enquiry of the Self or the underlying Reality of everyone. He used to preach that the Self is beyond body,mind and intellect. The S...

భగవద్గీతాపంచప్రాణములు. (Nectar of Holy Geeta in 5 slokas.)

Image
శ్రీకృష్ణపరమాత్మనేనమః! Today is The Holy Geeta Jayanthi. " Equanimity, though hard to maintain is a great virtue, keeps the mind at peace". Bhagavad Geeta. నేడు గీతాజయంతి. షుమారు 5000 సంవత్సరాల పూర్వము శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు కురుక్షేత్రయుద్ధ సమయమున గీతోపదేశము చేసాడు. గీత 18 అధ్యాయములుగ విభజింపబడినది, అందు 700 శ్లోకములు కలవు. అందునుండి మహర్షి సద్గురు శ్రీమలయాళస్వాములువారు 5 శ్లోకములను పంచప్రాణములుగా భక్తులప్రయోజనమునకై ఎన్నికజేసిరి. అవి వరుసగా 2. 14; 2. 45; 5. 20; 12. 17; 18. 54. ఈ పంచప్రాణముల ప్రయోజనమేమన వ్యక్తులకు దైవభావమునుండి మనస్సెపుడైన దృశ్యములోనికి, దృశ్యవృత్తిలోనికి, దృశ్యవిషయములోనికి చిన్నగ జారుచున్నదని తోచినచో ఈ శ్లోకములయొక్క పఠనము చేత, నర్ధచింతనముచేతను మేడపైనుండి చిన్నగా క్రిందకు పడిపోయిన వాడు మరల నింపాదిగా మెట్లపై నెక్కుచు గమ్యస్థానము జేరునట్లు; తిరిగి సహజమగు తురీయపదము (పరమశాంతి స్థితి) పొందగలడు. పై శ్లోకముల అనువాదమును క్లుప్తముగా తెలిసికొనెదము. " కుంతీపుత్రుడవగు నో అర్జునా! ఇంద్రియములకు శబ్దాది విషయముల తోడ గలిగెడు సంయోగములు శీతోష్ణములను, తన్మూల...

సాయిబాబా శివరూపుడా?

Image
శ్రీసాయినాథాయనమః! శ్రీసాయిబాబా అష్టోత్తరశతనామావళిలో మూడవనామం శ్రీరామకృష్ణశివమరుత్యాది రూపాయనమః. ఈనామభావమేమన శ్రీరామ, శ్రీకృష్ణ, శివ, మారుతి మున్నగు దేవతా స్వరూపుడైన సాయిబాబాకు నా నమస్కారము. అనగా నిచట బాబాను శివరూపునిగా చెప్పడమైనది. "పూజ్యశ్రీ భరద్వాజ మాష్టారు రంచించిన శ్రీసాయిలీలామృతగ్రంథంలొ బాబాలో పరమశివునిఁజూపు లీలలు కొన్ని కలవు. వానినిపుడు క్లుప్తముగా స్మరించెదము. మహల్సాపతి కుమారుడు మార్తాండమాల్సాపతి ఓరోజు ఖండోబా దేవాలయంవద్ద కూర్చొన్నాడు. సాయి వానియెదుట ప్రత్యక్షమైనారు. మార్తాండ్ నిలబడగానే బాబా నవ్వుచూ ఖండోబా విగ్రహంవైపు నడచి అందులో లీనమయ్యారు. ఆశ్చర్యంతో మార్తాండ్ విగ్రహంవెనుక వైపు చూసాడు. అక్కడెవ్వరూలేరు. తిరిగి విగ్రహంనుండి సాయి వెలువడి చిరునవ్వుతో ఆతనిఁజూస్తూ బయటకువెళ్లిపోయారు. నాటినుండి యతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవాడు. ( మహారాష్ట్రలో ఖండోబాను శివుని రూపుగా పూజిస్తారు). మరియొక ఉదాహరణ జూచెదము. బాబా సన్నిహిత భక్తురాలు లక్ష్మీబాయి షిండే ఓరోజు దునిదగ్గర స్తంభానికానుకొని కూర్చొంది. ఆమెతో సాయి అక్కడకు రోజూవచ్చే పామునుజూచావా యన్నారు. ఆమె చూడలేదంది. కొద్దినిముషాలలో...

జ్ఞానదివ్వెలు.

Image
శ్రీసాయినాథాయనమః! పాఠక భక్తులెల్లరకు దీపావళి శుభాకాంక్షలు! శ్రీసాయిజీవితచరిత్ర చదివిన భక్తులెల్లరకు ఓ సాయిలీల తప్పక గుర్తుంటుంది. అదేమన శిరిడీలో వర్తకులు సామూహికంగా నిర్ణయించుకొని బాబాకు నూనెనివ్వనివేళ సాయి నిరాశ చెందక ద్వారకామాయికి తిరిగివచ్చి ప్రమిదలను నీటితోనింపి దీపాలవెలిగించారు. రాత్రంతా దివ్వెలు ప్రకాశవంతంగా వెలుగుల నింపాయి. చాటున దాగియున్న వణిజులు తమతప్పుతెలిసికొని బాబాను క్షమార్పణ నర్ధించారు. వారితో సత్యాన్ని నమ్ముకొమ్మని చెప్పి క్షమించారసాయి. ఆధ్యాత్మిక పరంగాజూచినా సాయి అవతరించినదందులకే. అజ్ఞానపు చీకటిలో మగ్గుతున్న మానవాళికి తనబోధయనెడి జ్ఞానంతో సరైన మార్గం జూపారు.ఈ దీపావళి పర్వదిన సందర్భమున మన మనోదేహము లనెడి ప్రమిదెలలో సాయిపట్ల పరిపూర్ణవిశ్వాసమనెడి నూనెనింపి, భక్తిశ్రద్ధ వత్తులువేసెదముగాక. సాయి కరుణయే దివ్వెలవెలిగించు అగ్నిజ్వాల యగుగాక! ఆ దివ్వెల ప్రకాశంలో జీవనచర్యల చక్కదిద్దుకొంటూ సాయిచూపిన మార్గంలో గమ్యాన్నిచేరెదముగాక! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!

సాయిబాబా- నిత్యసత్యుడు, అనంతశక్తిస్వరూపుడు.

Image
శ్రీసాయినాథాయనమః! పాఠకభక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు! శ్రీసాయిబాబా శివ, శక్తి తత్వముల తనలో పరిపూర్ణముగ నింపుకొన్న మహాశక్తిస్వరూపుడు! నేడు బాబా మహాసమాధిచెందిన పుణ్యతిధి, 103 సంవత్సరములపూర్యము బాబా తమభౌతికరూపము చాలించారు. కాని సాయిబాబా నిత్యసత్యులు, ఈవిషయమై ముందుగా శ్రీసాయిసచ్చరిత్రము ఉపోద్ఘాతమున చెప్పబడిన కొన్ని అక్షరసత్యవాక్యముల స్మరించెదము. శ్రీ బీ.వీ . నరసింహస్వామిగారు తమ 'భక్తులయనుభవములు' పుస్తకము మొదటిపేజీలో ఓ హైకోర్టు జడ్జిగారి యనుభవమిలా వ్రాసారు. " నేను సాయిబాబాను సృష్టిస్థితిలయకారకుడుగా భావించెదను. 1918వ సంవత్సరములో వారుసమాధిచెందకముందు నేనట్లు భావించితిని. ఇప్పటికి నేనటులే భావించుచున్నాను. నాకుమాత్రము వారు సమాధిచెందినట్లు లేరు. నాదృష్టిలో వారు అన్నిపరిమితులకు అతీతులు. వారు మామధ్య యున్నప్పుడు వారిమానవశరీరము మాకనులముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడది మాదృష్టిని విశేషముగా నాకర్షించెడిది. కాని ఎక్కువభాగము మా ఎరుకలో నిలబడినదిమాత్రము వారి అనంతతత్వమే. శాశ్వతము-అశాశ్వతముల అద్భుతసమ్మేళన రూపమైన యొక మానసిక ప్రతిబింబమువలే వారు మాకు భాసించేవారు.అశాశ్వతమైన తమమానవ...

పవర్ అఫ్ అటార్ని !

Image
శ్రీసాయినాథాయనమ! శ్రీరామకృష్ణాయనమః! " పవర్ అఫ్ అటార్ని" అంటే ఏమిటో సాధారణంగా అందరికి తెలిసినవిషయమే. న్యాయస్దాన పరమగు తనసర్వహక్కులను వేరొకరికి సమర్పించుట. ముఖ్యముగా ఆస్తిపాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాలలో ఓ వ్యక్తి తాను స్వయంగా హాజరుకాలేనపుడు తనతరఫున నమ్మకమైన వేరొకవ్యక్తికి తన పూర్తిహక్కులను సమ్పరిస్తాడు. రెండవవ్యక్తి మొదటివ్యక్తి తరఫున పనిపూర్తిజేస్తాడు. ఇదే విషయం ఆధ్యాత్మికరంగంలో గురుశిష్యులకు కూడ వర్తిస్తుందనేది ప్రస్తుత వ్యాసములోని విషయము. శిష్యుడతనతనగురువునెలా సేవించాలో తెలిపే ఆధ్యాత్మిక అంశములుండుటచే భక్తులకిది సహాయకారి కాగలదని తలచి వ్రాయడమైనది. శ్రీరామకృష్ణ పరమహంస మరియు ఆతని ప్రియశిష్యుడు గిరీష్ చంద్రఘోష్ లకు సంబంధించిన విషయమిది.అప్పట్లో గిరీష్ (1844-1912)బెంగాల్ రాష్ట్రంలో మిగుల పేరొందిన రంగస్థలనటుడు కళాకారుడు రచయిత దర్శకుడు.ఇతడు శ్రీరామకృష్ణను పెక్కుమార్లు దర్శించి వారికి మిగుల సన్నిహితభక్తుడైనాడు. ఓ రోజు గిరీష్ పరమహంసనిలా అడిగాడు, " స్వామీ! ఇప్పటినుండి నేనెలాంటి సాధనచేయాలి? " అందులకు శ్రీరామకృష్ణ సమాధానంగా " ప్రస్తుతం జీవనమే కొనసాగించు. ఓ చేత్...