Posts

శ్రీసాయిసందేశామృతము 5. (Nectar of Sri Sai's Message 5). Merry Christmas to all the readers!

Image
శ్రీసాయినాథాయనమః. సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము శ్రీసాయిసందేశామృతము అధ్యాయము 5. జగత్కళ్యాణకారకులు శ్రీసద్గురుసాయినాథులు! ఒక్కరోజు జరిగే వివాహమహోత్సవానికి వచ్చి లోకకళ్యాణార్ధమై శిరిడీలో శాస్వితంగా, కాలానికతీతంగా వెలుగొందుచున్నారు. నవవిధభక్తులకు సంకేతమన్నటుల చాందుభాయి పాటీలు తొమ్మిదిమైళ్ళు నడచినపిమ్మట మామిడిచెట్టు నీడలో నొక వింతఫకీరును దర్శించాడు. పాటీలు తప్పిపోయిన తన గుఱ్ఱముకై మిగుల చింతితుడు. ఫకీరు, ఒక్కమాటతోనే తప్పిన గుఱ్ఱపుజాడ తెలిపి వాని మనసుకు శాంతిని సమకూర్చాడు. నిలకడలేని అశ్వం చంచలమైన మనసుకు సంకేతం. సద్గురు సన్నిధిలో శాంతిపొందెడి మనసులాగా, దారితప్పిన గుఱ్ఱాన్ని తిరిగి పొందాడు పాటీలు.శాంతించిన మనసుకు గురుకృపయనెడి చిలుము లభించింది. ఆచిలుము వెలిగించే క్రియలో నీరు నిప్పుల సృష్టి జూసిన పాటీలు మిగుల చకితుడై ఫకీరుశక్తికి వసుడైనాడు. పంచభూతాలు సైతం సద్గురు ఆజ్ఞను పాటించవలసినదే! పెండ్లివారితో వచ్చి ఖండోబాగుడివద్ద బండిదిగుచున్న ఫకీరును, అప్రయత్నంగా "సాయి"పిలుపుతో పూ...

శ్రీసాయిసందేశామృతము 4 (Nectar of Sri Sai's message 4.) Happy Geeta Jayanthi.

Image
శ్రీసాయినాథాయనమః. సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము. శ్రీసాయిసందేశామృతము: అధ్యాయము 4. పరస్పర ఆకర్షణచే గ్రహాలు చలించినట్లు,దైవశాసనానికి అనుగుణంగా సృష్టి నడుస్తుందనేది సనాతన సత్యవాక్కు. దైవనిర్దేశ ధర్మానికి హాని జరిగినప్పుడు ఆదైవమే ఓ అవతారరూపుదాల్చి పరిస్థితుల చక్కబెడతాడనేది గీతావాక్యం. ఆ కోవలోనే కాలానుగుణంగా సద్గురువుల అవతరణ జరుగుతుంది. అందుకోసమే సాయిబాబా శిరిడీలో ప్రత్యక్షమై వర్ధిల్లారు.వారి నివాసం చేతనే శిరిడీ పావన క్షేత్రంగా పరిధిల్లుచుంది.వారిపాదస్పర్శచే అచటి ప్రతిధూళికణం పవిత్రత సంతరించుకొంది. వారి దైవసాన్నిధ్యంలో చంచలమనసులకు పరమశాంతి ప్రాప్తిస్తుంది. అది నిత్యసత్యం,నిరంతర ప్రక్రియ. భక్తులయనుభవాలే ఇందులకు సాక్ష్యం.కారుణ్యమూర్తి పండరీపురరంగని కలియుగరూపమే శిరిడీలోని సాయిబాబా.భగవంతుని స్మరణ, సంకీర్తనలు సదా సాయికి ప్రీతిపాత్రములు. "అల్లా మాలిక్ " వారినాలుకపై నిత్యం నాట్యంజేసే మంత్రాక్షరాలు. దాసగణు మహారాజుచే విఠలనామసప్తాహం జేయించి, దీక్షితుకు ధ్యానదర్శనమివ్వడ...

శ్రీసాయిసందేశామృతము 3 (Nectar of Sri Sai's message 3).

Image
శ్రీసాయినాథాయనమః.నేడు శ్రీసత్యసాయిబాబ శతజయంతోత్సవము . బాబాప్రేమవర్షం అందరిపై కురియుగాక ! సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము. శ్రీసాయిసందేశామృతము 3.శ్రీసాయిలీలల వెనుక జ్ఞానబోధ,ధర్మబోధ,వివేకవైరాగ్యములు సూక్ష్మరూపంలో మిళితమై ఉంటాయి. బోధ శ్రవణ మననాదులచే హృదయంలో భక్తిప్రేమలు అప్రయత్నంగానే వికసిస్తాయి.బాబాలీలలు ఎలాంటి తర్కానికి అందక మిగుల ఆనందాశ్చర్యముల కలిగిస్తుంటాయి. కావున పదే పదే చెప్పెడివారు బాబ, "ఎవరు సదా నన్ను పూజింతురో,స్మరింతురో,చరిత్ర మననం చేయుదురో వారికి తృప్తి శాంతుల సమకూర్చెదను. సకల రోగముల నివారించెదను. మరణమునుండి బయటకు లాగెదను. పాపముక్తులజేసెదను". బలమైన అయస్కాంత క్షేత్రపరిధిలోనున్న లోహరజము ఆ క్షేత్రశక్తిని సంతరించుకొన్నట్లు; పరమానందానికి, తృప్తిశాంతులకు నిలయమైన సాయిసన్నిధిలో భక్తులు మిగుల ఆనందభరితులు కావడం సహజమేకదా! పునరపి మరణ పునరపి జనన వలయంనుండి భక్తులలాగి సద్గతి ప్రసాదిస్తారు సాయి. భక్తుల భావాల, శక్తియుక్తుల కనుగుణంగా వారికి పనులప్పచెప్పెడివారు బాబా. అ...

శ్రీసాయిసందేశామృతము 2(Nectar of Sri Sai's message 2).

Image
శ్రీసాయినాథాయనమః. నేడు పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ 87వ జయంతి పర్వదినము. సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము. శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 2. సాయిలీలలు వినోదంతోపాటు విజ్ఞానాన్ని సంతోషాన్ని కల్గిస్తాయి. ఆపారవశ్యంతోనే రచయిత అన్నాసాహెబ్ దబోల్కర్ సాయిమహిమలను గ్రంధస్తం జేశాడు. ఆత్మస్థాయి నిండి వెలువడే సాయి దైవలీలలు సాధారణ మానవుల మానసిక తర్కానికందనంత దూరంగా ఉంటాయి. మరి అలాంటి సాధారణ మనసుతో అసాధారణ గ్రందాన్నెలా రచించాడు? అదే గురుమహిమ,సద్గురుసాయి కృప. ప్రేరణ సాయిది, రచయితా సాయియే! అన్నాసాహెబ్ కేవలం ఉపకరణమాత్రమే. సాగర అలలుగా సాయిలీలలు నిత్యనూతనములు, సత్యబోధకములు. శోధించేకొలది సాధకునికి నూతనభావాలు ఆవిష్కృతమౌతాయి. సాయిపలుకులు ఆత్మలోతులనుండి వెలువడే వెలుగుకిరణాలు.రచయిత తన అహంకారాన్ని గురుచరణాల సర్వసమర్పణజేసి గ్రంథరచనకు కావలసిన శక్తిని,బుద్ధిబలాన్ని సంతరించుకొన్నాడు. రచనజేయు తన తలుపును అత్యంత భక్తుడు శ్యామా ద్వారా విన్నవించుకొని బాబా నుండి యూది, అశీసులు పొందాడు. వాని అహం సూన్యమైనపిమ...

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)

Image
శ్రీసాయినాథాయనమః.సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము. పాఠక భక్తులెల్లరకు విజయదశమి శుభాకాంక్షలు,సదా బాబా ఆశీసులు! సమర్ధసద్గురు శ్రీసాయినాథులకు శతకోటి హృదయపూర్వక నమస్కారములతో ఈ వ్యాసమును ప్రారంభిస్తున్నాను. బాబా దయవలన గత కొన్ని సంవత్సరములుగా శ్రీసాయి సచ్చరిత్ర నిత్యపారాయణము విధిగా జరుగుచున్నది. చదివిన ప్రతిసారి కొత్త కొత్త అర్ధాలు,సందేశాలు స్ఫురణకు రావడం గమనించాను. చదివిన మొదట్లో బాబా లీలలు భక్తుల బాధానివారణ కన్నట్లు తలచేవాడను. పారాయణము కొనసాగేకొలది లీలల వెనుక బాబా మనకేదో సందేశమిస్తుంన్నారనే భావన కలుగ సాగింది. లోతుగా చదివిన పిమ్మట నిగూఢసందేశాల జాడ కొద్ది కొద్దిగా అవగాహన కొచ్చెడిది. అధ్యాయ క్రమంలో ఆయా లీలాసందేశాల సమాహారమే ప్రస్తుత సాయిసందేశామృతము. పాఠక భక్తులకు పారాయణానంతరము సాయిలీలల వెనుక వేరువేరు అర్ధములు,భావములు గోచరించుట సహజము. ప్రస్తుతం నా జ్ఞానపరిధికందిన భావాలను తోటి సాయి భక్తులతో పంచుకుంటున్నాను. ఇది పూర్తిగా వ్యక్తిగత భావన. భక్తులెల్లరు తమతమ సూచనలను,స్పందనను క్రిందనున్న...

విష్ణుమాయ.

Image
శ్రీసాయినాథాయనమః! లేనిది ఉన్నటుల,ఉన్నది లేనటులగ ఇంద్రియములకు గోచరమగునది మాయయని విజ్ఞులు వివరిస్తుంటారు. మానుష నామరూపాలు తాత్కాలికములు, అందులకు మూలమైన చైతన్యము నిరంతరంగా వెలుగుతుంటుంది. కనులకు కనబడు మనుషులు వస్తువులు నిత్యమని, వారిని నడిపించే శక్తికెలాంటి అవసరము లేదని తలచుట మాయగ వారు బోధిస్తుంటారు. శ్రీసాయిసచ్చరిత్ర లోని 13వ అధ్యాయములో విష్ణుమాయను గూర్చి వ్యాఖ్యానించారు సాయిబాబా. తనకు ఇల్లూవాకిలి భార్యాబిడ్డలు ఇతర బాదరబందీ లేనప్పటికీ తాను ఎక్కడికీ కదలక పాత మజీదున యున్నప్పటికీ హరిమాయ తన్నావరించి బాధిస్తుందని. బ్రహ్మ ఇంద్రాది దేవతలను,నారదాది మహామునులు సయితం విష్ణుమాయ విడవలేదుగదా! ఇందులకు నివారణోపాయంగా మాయాముక్తి మార్గాన్ని దయతో బోధించారు బాబా. అదేమన నిరంతరం భజనజేసి హరిని ప్రసన్నుని జేసుకుంటే ఆ మాయపొర తొలగుతుందని.యోగులు తమ ప్రతిరూపమని శ్రీకృష్ణ భగవానులు గీతలో చెప్పియున్నారు. అదేసందర్భంలో మాయనుండి బయటపడుటకు ఓ నిగూఢసత్యాన్ని భక్తులకు తెలిపారు బాబా, ఎల్లప్పుడు సాయి సాయి యని స్మరించిన సప్తసముద్రముల మాయను దాటించెదనని. అనగా సాయినామస్మరణ, హరినామస్మరణ సమతుల్యమని చెప్పకనే చెప్పారు. అంటే ...

అధ్యాత్మ రామాయణము : గుహుని శ్రీరామదర్శనము.

Image
శ్రీసాయినాథాయనమః ! సీతాలక్ష్మణహనుమత్సమేత శ్రీరామచంద్రాయనమః ! అరణ్యవాససమయమున సీతాలక్ష్మణ సహిత శ్రీరాముడు సుమంత్రునిచే నడుపబడిన రథమవరోహించి సర్వసమృద్ధములగు ప్రదేశముల జూచుచు ,శృంగవేదపురము దాపుననేయున్న గంగాతీరము చేరెను . గంగనుదర్శించి నమస్కరించి ప్రసన్నమనస్కుడై అందు స్నానమాచరించి పిదప సమీప శింశుపావృక్షమునీడ కూర్చుండెను . ఆసమయమున గుహుడు పరిజనులద్వారా రామ శుభాగమన వార్తవిని సఖుడు , స్వామియగు రాముని దర్శించుటకై పరమానందముతో,భక్తితో ఫల మధుపుష్పాదులను చేకొని కదలివచ్చి సాష్టాంగ దండ ప్రణామము జేసెను . రాముడు వెనువెంటనే ఆతనిలేవనెత్తి ఆలింగనము జేసికొనెను. శ్రీరాముడు కుశలమడుగగా గుహుడు చేతులు జోడించి " లోకపావనా ! నేను ధన్యుడను . నా యీ నిషాద జన్మము సఫలమైనది . మీ శరీర సంస్పర్శమున నేను పరమానందమును పొందితిని . రఘువరా ! నిషాదుడనగు ఈదాసుని రాజ్యము నీదియే! నీవిచ్చటనేయుండి మమ్ము పాలించుము . నగరమునకు వచ్చి నన్ను పావనము జేయుము . దేవా ! నీకై సేకరించిన యీ ఫలమూలాదులను స్వీకరింపుము . సురోత్తమా ! నేను నీ దాసుడను . నాపై కృపచూపుము " అని ప్రార్థించెను. రాముడీమాటలకు అత్యంత ప్రీతిచెంది " ...