Posts

Showing posts from July, 2019

సాయి కథలు - తమభక్తుల అవహేళన సహింపని శ్రీహరియే సాయినాథులు!

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - తమభక్తుల అవహేళన సహింపని శ్రీహరియే  సాయినాథులు!  సాయిలీలలను స్మరిస్తుంటే శ్రీకృష్ణుని, శ్రీరాముని,  గాథలు కనులముందు గోచరిస్తాయని రచయిత హేమాద్రిపంత్ శ్రీసాయిసచ్చరిత్రములో పేర్కొన్నాడు. నాకుకూడ అలాంటి యనుభవమే అపుడపుడూ కలుగుతుంటుంది. శ్రీసాయిసచ్చరిత్రము 48వ అధ్యాయములోని శేవడే మరియు సపత్నేకర్ కథలు చదువునపుడు ఓ మధురమైన విష్ణులీల మనసుకి తట్టింది. ఆవివరాలను క్లుప్తంగా పరిశీలిద్దాము.  ముందుగా సపత్నేకరు గూర్చి తెలిసికొందాము. షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట నివాసి యతడు, తన లా పరీక్షకు చదువుచుండెను. శేవడే ఆతని సహవిద్యార్థి, సాయిబాబాను మిగులునమ్మినవాడు. తానుబాగుగ చదవకున్నను బాబాకృపతో లాపరీక్షలో తప్పక ఉత్తీర్ణుడ కాగలనని విశ్వసిస్తాడు. బాబాపై యాతని అపార విశ్వాసానికి నవ్వుకొంటాడు సపత్నేకర్. అంతేగాక బాబాను సయితము వెక్కిరిస్తాడు. పరీక్షలో పాసైన సపత్నేకర్ అక్కల్ కోటలో న్యాయవాదవృత్తి ప్రారంభిస్తాడు. పదేళ్ళపిమ్మట  దురదృష్ట వశాత్తు తన భార్యను, ఒక్కగానొక్క కొడుకుని కోల్పోతాడు. మిగుల వికలమనస్కుడై పండరీపురము, గాణ్గాపుర పుణ్యక్షేత్రముల దర్శిం...

సాయి కథలు - యోగీశ్వరుల ఏకాత్మభావన !

Image
ఓంశ్రీసాయినాథాయనమః సాయి కథలు - యోగీశ్వరుల ఏకాత్మభావన !  నేడు గురుపౌర్ణమి  112 సంవత్సరములకు పూర్వము, అనగా 1917వ సంవత్సరమున గురుపౌర్ణమి రోజున ఠాణా  జిల్లా  దహను గ్రామానికి చెందిన భక్తుడు హరిభావ్ కర్ణిక్  బాబాను తగువిధమున పూజించి వస్త్రముల, దక్షిణల సమర్పించాడు. శ్యామా ద్వారా బాబా సెలవుపొంది మసీదునుండి బయలుదేరాడు. కొంతదూరం వెళ్ళినపిమ్మట బాబాకు మరొక్క రూపాయి దక్షిణనివ్వాలనే భావంతో వెనుదిరిగాడు. అలా సెలవుపొందినపిమ్మట  తిరిగిరావడం శిరిడీ సాంప్రదాయానికి వ్యతిరేకమని యచటి వారుచెప్పుటచే కర్ణిక్ తనప్రయాణం కొనసాగించాడు. మార్గమధ్యంలో నాసిక్ లోని కాలారాముని దర్శించుకొని మందిరమునుండి వెలుపలికి వచ్చునపుడు యచటనే వేంచేసియున్న నరసింగ మహరాజ్ యను యోగిపుంగవులు తమభక్తులవిడచి హరిభావ్ చేతిని పట్టుకొని తమరూపాయి తమకివ్వవలెనని పట్టుపట్టారు. మిగుల ఆశ్చర్య ఆనందాలకు లోనయిన  కర్ణిక్  తాను సాయికివ్వదలచిన దక్షిణరూపాయిని నరసింగ్ మహారాజుకు సమర్పించాడు. యోగీశ్వరుల అంతరంగములు  ఒకేస్థాయిలో  వ్యాపించియుంటాయి, ఒకరిభావాల మరొకరు యతిసులువుగా గ్రహింపగలరను సత్యము ని...

సాయి కథలు - ఉపనిషత్తుల బోధ, సాయి జీవన ధార !

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - ఉపనిషత్తుల బోధ, సాయి జీవన ధార ! నేడు గురుపౌర్ణమి  నేటి విజ్ఞానయుగంలో ఎన్నో శాస్త్రములు  వెల్లివిరిసాయి. రసాయనిక, భౌతిక, వృక్ష, జంతు, వైద్య మరియు యిలాంటి ఎన్నోశాస్త్రములు. ప్రతి శాస్త్రము గూర్చి తెలిసికోవడానికి విద్యార్థులు ప్రధమంగా  తరగతిగదిలో పాఠ్యపుస్తకాలను చదవడం అనివార్యము. ఆపై అందువివరింపబడిన సూత్రములు , ఆయా సంబంధిత ప్రయోగశాలలలో నిర్ధారింపబడుటయను సత్యము యెల్లరకు తెలిసిన విషయమే!  అటులనే మానవుని ఆధ్యాత్మిక జీవనపురోగమనానికి వెలుగుజూపు మార్గదర్శక సూత్రములు, రహస్యములు  మన ఉపనిషత్తులలోను, భగవద్గీత, భాగవతాది గ్రంధాలలోను వివరింపబడినవి. భగవంతుడు సర్వవ్యాపి, ఆత్మ జననమరణాలకతీతము, కర్మఫలములకెవ్వరూ అతీతులుకారు,  సర్వస్య శరణాగతితోడనే  దైవమును జేరగల మను బహుమూల్య సత్యములు  పై చెప్పబడిన గ్రంధాలలో కూలంకుశముగా చర్చింపబడినవి. శ్రీసాయిబాబా జీవితమును నిశితముగా పరిశీలించిన కొన్నిసత్యములు తెలియగలవు. సర్వమత ఆధ్యాత్మిక గ్రంధాలను  పాఠ్యపుస్తకాలుగా తలస్తే, ఆయాగ్రంధవిశ్లేషణా విషయములకు ప్రయోగశాల బాబా జీవితము. చెప్పబడిన ఆసత్...

సాయి కథలు - తీవ్ర ప్రార్థన లేక వ్యాకులత !

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - తీవ్ర ప్రార్థన లేక వ్యాకులత  నేడు గురుపౌర్ణమి  నీటిలో పంచదార వేసినకొద్దీ తీపి క్రమంగా పెరుగుతుంది. అలాగే దైవంపై భక్తి, ప్రేమ, అనురాగాలు,  పెరిగేకొలది వ్యక్తి  తన్మయత్వం వృద్ధిచెందుతోంది. దైవానుగ్రహానికి తీవ్రస్థాయిలో మన  ప్రార్ధన కొనసాగాలని మహనీయుల సందేశం. వివేకవైరాగ్యములతోకూడిన వ్యాకులత భగవంతుని పొందుటకు రహస్యమార్గమనియు, నీట మునిగిన మనిషి  గాలికై తపించునంత తీవ్రవేదనతొ  దేవుణ్ణి వేడుకోవాలని    శ్రీరామకృష్ణ పరమహంస చెప్పియున్నారు. తమ తీవ్రమైన ప్రార్థనచే సాయిబాబా అనుగ్రహమును పొందిన భక్తుల అనుభవమునొకదానిని శ్రీసాయిసచ్చరిత్రములోని 35వ అధ్యాయములో  చూస్తాము. బాలాజీ పాటీలు నెవాస్కరు తన జీవితకాలంలో బాబాను మిగుల భక్తిశ్రద్ధలతో సేవించిన ధన్యుడు. ఆతడు మరణించిన పిమ్మట  ఓరోజు వాని సంవత్సరికమునాడు  నెవాస్కరు పరివారము  తమబంధువులను  భోజనమునకు పిలిచారు.  కాని భోజనసమయానికి పిలిచినవారికి మూడురెట్లుగ  బంధువులొచ్చారు.  వండిన వంటకములు వచ్చినవారలకు చాలవనియు, తమకుటుంబ గౌరవమునకు భంగము...

సాయి కథలు - 'ఇంకను నన్ను నమ్మవా! '

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు -   'ఇంకను నన్ను నమ్మవా!'  నేడు గురుపౌర్ణమి  నాసిక్ జిల్లా, మాలేగాం లో నివేసించే వైద్యుడు. వానిమేనల్లుడు  నయంకాని రాచకురుపుచే బాధపడుచున్నాడు. డాక్టరుతో పాటు ఇతర డాక్టర్లుకూడా నయంచేయలేకపోయారు. తుదకు పిల్లవాని తలిదండ్రులు బాబాను శరణువేడారు. బాబా కృపచే మేనల్లుడు రోగముక్తుడైనాడు. ఈవిషయం తెలిసిన డాక్టరు మిగుల ఆశ్చర్యపడ్డాడు. మాలేగాం నుండి శిరిడీ మీదుగా  బొంబాయి వెళ్ళుమార్గమధ్యలో సాయిబాబాను దర్శింప దలచాడు  డాక్టరు. కాని మాలేగాం, మన్మాడులలో బాబానుగూర్చి కొందరు వ్యతిరేకంగా చెప్పుటచే తనమనసు మార్చుకున్న డాక్టరు నేరుగా బొంబాయి వెళ్ళాడు. తానున్న బొంబాయిలో వరుసగా మూడురాత్రులు " ఇంకను నను నమ్మవా " యనుమాటలు వినిపించుటచే మరల మనసుమార్చుకొని శిరిడీ వెళ్ళ సంకల్పించాడు.   తనమనసులో సాయిని పరీక్షింపదలచి, తానుఁజూచుచున్న రోగి అదేరోజున బాగయిన మరుసటి దినమే శిరిడీ వెళ్ళ దలచాడు . ఆశ్చర్యకరంగా రోగి బాగాగుటచే డాక్టరు అనుకొన్నవిధంగా బాబాను దర్శించి మిగులభక్తిశ్రద్ధల నమస్కరించి   ఆసీసులు పొందాడు. తనకు చక్కటి అనుభవములు...

సాయి కథలు - నారికేళ మహిమ !

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - నారికేళ మహిమ నేడు గురుపౌర్ణమి  సఖారాం ఔరంగాబాద్ కర్  మహారాష్ట్రలోని షోలాపూర్ నివాసి. వాని భార్యకు 27 సంవత్సరాలైనను బిడ్డలు పుట్టలేదు. పెక్కువ్రతములాచరించినను ఎట్టి ఫలితం లభింపకపోవుటచే తన సవతి కొడుకు విశ్వనాథునితో శిరిడీకి వచ్చినది. శ్యామాసహాయంతో ఒంటరిగానున్న బాబాను సమీపించి కొబ్బరికాయ, అగరవత్తులు సమర్పించింది. సాయి ఆటెంకాయను ఆడించెను. అదిఎండుదికనుక కుడుక  లోపల ఆడుటచే శబ్దము వచ్చుచుండెను. ఆ శబ్దానికి అర్ధమేమని శ్యామా నడిగారు. తన గర్భంలోగూడ ఓబిడ్డ అటులనే ఆడవలెనని  కోరుకొనుచున్నది కావున తమ ఆశీస్సులతో టెంకాయను  యామెకివ్వవలసినదని శ్యామా బదులిచ్చాడు.ఈవిషయముపై  వారిద్దరిమధ్య కొంత సంవాదము జరిగిన పిమ్మట, బాబా ప్రసన్నులై యామెకు సంవత్సరములోపున సంతానము కలుగునని ఆశీర్వదించారు. టెంకాయ పగులగొట్టి ఓచిప్ప వారివురుతిని రెండవచిప్పను ఆశీసులతో ఆమెకిచ్చారు. సాయి దీవెనలచె ఒక సంవత్సరములో ఆమెకు కొడుకు పుట్టాడు. 5వ మాసంలో బాబా ఆశీసులకై  బిడ్డను తెచ్చి గురుపాదముల ప్రణమిల్లారు. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలివ్వ బాబాగుఱ్ఱము శ్యామకర్ణకు...

సాయి కథలు - శ్రద్ధ !

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - శ్రద్ధ  నేడు గురుపౌర్ణమి  ఏవిషయంపైనను పట్టు సాధించాలంటే ఆ విషయంపై మిగుల శ్రద్ధ జూపటం మిగుల ఆవశ్యకం. ఉదాహరణముగా విద్యపట్లగాని, ధనసంపాదన పట్లగాని, లేక ఏదైనా కార్యసాధనపట్లగాని మిగుల శ్రద్ధజూపనిదే లక్ష్యమును జేరలేము. మరి ఆధ్యాత్మిక విషయాలకొస్తే లక్ష్యసాధనకు మరింత శ్రద్ధ అవసరము. అందులకే సాయిబాబా శ్రద్ధ-సహనముల గూర్చి మరీమరీ చెప్పారు. శ్రద్ధకు సంబంధించి శ్రీసాయిసచ్చరిత్రలో చెప్పబడిన ఒక  ఉదాహరణమునిచట పరిశీలించెదము.  1910వ సంవత్సరము దీపావళి ముందురోజైన ఘనత్రయోదశి నాడు జరిగిన విషయం, బాబా మండుచున్న ధునిలో తమ చేయిదూర్చి ఎంతో దూరాన  కొలిమిలో బడనున్న బిడ్డను రక్షించారు. బిడ్డ రక్షింపబడినదిగాని, బిడ్డకర్మఫలంచే బాబా చేయి మిగుల కాలిపోయినది. ఈవిషయంతెలిసిన బాబాప్రియ భక్తుడు నానాసాహెబు చాందోర్కరు  బొంబాయినుండి  డాక్టరు పరమానందు యను ఖ్యాతిగాంచిన వైద్యుని వెంటనిడుకొని వచ్చారు. కాని సాయిబాబా తమకేమాత్రము బాధలేదని వానిసేవల తిరస్కరించారు. ఈసంఘటన తరువాత ప్రతిరోజు భాగోజీ షిండే యను సన్నిహిత భక్తుడు బాబాచేతికి కట్టుకట్ట నారంభించాడు. ...

సాయి కథలు - అడ్డబల్లపై బాబా శయనం !

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - అడ్డబల్లపై  బాబా శయనం  బాబా తమలీలలచే భక్తులకు కొన్నిసందర్భములలో వినోదమును చూపెడివారు. ఓపర్యాయం నానాసాహెబ్ దేంగలే యను భక్తుడు బాబా పరుండుటకై  షుమారు ఐదారు అడుగుల పొడవు, ఎనిమిది లేక  తొమ్మిది అంగుళాల వెడల్పు గలిగిన  చెక్కబల్లను తెచ్చాడు. ఆబల్లను నేలపైనుంచి పరుండుటకు బదులు వింతగా బాబా దానిని మజీదు దూలములకు సన్నని గుడ్డపీలికలతో ఉయ్యలలా కట్టి దానిపై నిదురించ మొదలిడినారు. బలహీనమైన గుడ్డపీలికలు బల్లనుమోయుటయే గగనముకాగా, బాబాసయితము నెట్లు భరించెనో చూచువారలకు మిగుల వినోద  ఆశ్చ్యర్యములకు  కారణమైనది. ఎంతప్రయత్నించినప్పటికీ, బాబా బల్లనెక్కుట , దిగుట  భక్తులు గమనింపలేకపోయారు. ఈవింతలీల జూచుటకు క్రమంగా జనులు తండోపతండాలుగా రావడం మొదలెట్టారు.  కొంతకాలానికి బాబా విసుగుచెంది ఆబల్లను విరిచివేశారు. ఈపైవిషయమై పతాంజలి యోగ  సూత్రములలోని  మూడవభాగమైన విభూతి పాదములో  వివరియింపబడిన విషయములను  జూచెదము. ఆ వివరణప్రకారముగా ఆకాశతత్వమునుండి జీవుల దేహముదయించినది. యోగి ఈ 'ఆకాశ - దేహ' తత్వాలపై సంయమము ( ధారణ,ధ్యాన...

సాయికథలు - విశ్వాసము

Image
శ్రీసాయినాథాయనమః  సాయికథలు - విశ్వాసము  శ్రీసాయినాథులు తమభక్తులకెలాంటి ఉపదేశము నివ్వనప్పటికి, ఉపదేశంలాంటి ఓ ఉపదేశమిచ్చారు, అదే బాబా చెప్పిన " శ్రద్ధ-సబూరి". గురువుపట్లగాని, దైవంపట్లగాని, మొక్కవోని అకుంఠితవిశ్వాసం సదానిలుపుకోవడమే సాయి ఉపదేససారాంశము. ఇదేసూత్రాన్ని సాయి తమగురువుపట్ల తమసాధనాజీవితంలో ఆచరించి తమ గురుకృపకు పాత్రులై , తుదకు తామే సద్గురురూపులైనారు. శ్రీసాయిసచ్చరిత్రములో సాయిని పరిపూర్ణవిశ్వాసంతో సేవించిన కాకాసాహెబు దీక్షితు, దాసగణు, నానాసాహెబు చాందోర్కర్, శ్యామా (మాధవరావు దేశపాండే), రాధాకృష్ణ ఆయి లాంటి కొందరిభక్తుల వివరాలు చూస్తాము. ప్రస్తుతం సాయిపట్ల శ్యామయొక్క భక్తివిశ్వాసాలను పరిశీలిద్దాము. బాబాపట్ల శ్యామాది సఖ్యభక్తి, శ్రీకృష్ణునిపట్ల అర్జునుడు చూపిన నమ్మకము, విశ్వాసమును పోలియుంటుంది. తన ప్రతిశ్వాసలోను సాయిపట్ల ప్రేమానురాగాలను, భక్తిశ్రద్ధలను  నింపుకున్న ధన్యుడు శ్యామా. ఒకరోజు శ్యామా చిటికిన వ్రేలును పాముకరిచింది. క్రమంగా దేహంలోకి విషంవ్యాపింపసాగింది. తనకు మరణం తప్పదని భయపడ్డాడు శ్యామా.  సాధారణంగా శిరిడీలోని ప్రజలు పాముకాటు నివారణకు యచటి విఠలు దే...