సాయి కథలు - నిత్యంజేసే పనులలో సందేహమొస్తే ?
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - నిత్యంజేసే పనులలో సందేహమొస్తే ? " మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి సచ్చరిత్రము " నీకు కర్మలయందుగాని, ఆచరణమునందుగాని యేదేని సందేహము గలిగినేని, అకాలమునందాదేశమున ధర్మాధర్మ విచారణ సమర్థులును, ఆచార్యులును, నియమనిష్టలు గలవారును, స్వతంత్రులును, క్రూరతలేనివారును, కామహతులుగాని వారును, ధర్మకాములునునగు బ్రహ్మనిష్ఠులగు మహాత్ములు, ఆయా కర్మ ధర్మాచారమునందెట్లు ప్రవర్తించుచుందురో అట్లే నీవును ప్రవర్తించుము, వారల విచారించి (వారులేనిచో వారి వారి పవిత్ర జీవిత గ్రంథముల పఠించి, వారివారి సందేశముల పాటిస్తూ) వారు చేయునట్లు చేయుము. ఇదియే ఆదేశము, ఉపదేశము, వేదోపనిషద్రహస్యము, అనుశాసనము ఈశ్వర శాసనము మరియు ఉపాస్యము." స్తోత్రమంజరి : సద్గురు శ్రీమలయాళ స్వామి సాయిబాబా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, స్వామి వివేకానంద, మళయాళస్వామి, ప్రముఖస్వామి, మహాత్మా గాంధీ లాంటి మహాత్ములు కాలానుగుణముగా మనమధ్య అవతరించి సర్వమానవ ఏకత్వమును, సోదరభావమును, ఇతరులపట్ల గౌరవప్రేమాదరణలను, అన్నిమ...