Posts

అప్పడమువెనుక దాగిన వేదాంతభావము.

Image
శ్రీసాయినాథాయనమః. శ్రీరమణ దేవాయనమః. పాఠక భక్త మహాశయులెల్లరికి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు! " నన్ను వెదుకుటకు నీవు దూరముగాని మరెచ్చటికిగాని పోనక్కరలేదు. నీ నామము నీ యాకారము విడిచినచో నీలోనేగాక యన్నిజీవులలోను , చైతన్యము లేదా యంతరాత్మయని యొకటి యుండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనేగాక అన్నిటిలోను నన్ను జూడుము." శ్రీ సాయిబాబా. " ఓ అర్జునా! నేను సకలభూతములయొక్క హృదయ కమలమందుండు ప్రత్యగాత్మ(Self)ను, సమస్తభూతములయొక్క ఆది మధ్యాంతములును నేనే". భగవద్గీత 10:20. క్లుప్తంగా శ్రీకృష్ణపరమాత్మ సందేశమునీవిధంగా గ్రహింపగలము,' ప్రతిమనిషి, తన దేహానికి , మనసుకు, బుద్ధికి మరియు అహంకారానికి అతీతంగా లోలోపరి పొరలలో దాగిన సత్ చిత్ ఆనంద రూప భగవంతుని ఉనికిని సాధనద్వారా గ్రహించి ఆపై ఆత్మానుభవము లేక ఆత్మసాక్షాత్కారము పొందుటయే మానవజన్మ పరమార్ధము'. తమభక్తులెల్లరు ఈ అనుభవాన్ని పొందుటకు, భగవాన్ శ్రీరమణమహర్షి ఓ చక్కని సాధనామార్గాన్ని క్రిందివిధంగా అప్పడరూపంలో సూచిస్తున్నారు. ప్రస్తుత అప్పుడపు కథ భగవాన్ శ్రీ రమణ మహర్షికి వారి దివ్యజనని అలగమ్మాళ్ కు మధ్యజరిగిన జ్ఞానసందేశమ...

గోధుమలు విసరుట, వేదాంతభావము. (The significance of Saibaba grinding wheat.)

Image
శ్రీసాయినాథాయనమః. నేడు శ్రావణిపూర్ణమి, 1912 ఈ పవిత్ర తిధినాడు సాయిబాబా ఆశీసులతో గురుస్థానమువద్ద బాబాపాదుకలు ప్రతిష్టింపబడ్డాయి. శ్రీసాయిసచ్చరిత్ర పావన గ్రంధంలో శ్రీసాయిబాబా తాము ద్వారకామాయిలో నివసించిన షుమారు 60 సంవత్సరముల కాలం తిరుగలిలో గోధుమలు విసిరినారని గ్రంధకర్త శ్రీహేమాడపంతు పేర్కొన్నాడు. ఇపుడు తిరుగలి, గోధుమలు, విసరుట, గోధుమపిండి వీని వెనుకనున్న వేదాంతభావమును పరిశీలించెదము. రచయిత ఈవిషయమై వేదాంతభావమును కొంతవివరించినా మరింత లోతుగా ఈ విషయమై తెలిసికొనుటకు జేసిన ప్రయత్నమే ఈ ప్రస్తుత వ్యాసరచన ముఖ్యోద్దేశము. పాఠక భక్తులు తమతమ ఆలోచనలకనుగుణంగా ఈవిషయాన్ని గ్రహించగలరు. బాబా విసరినది ముడి గోధుమలు, వాటిలో జీవమున్నది, అనుకూలపరిస్థితులలో తిరిగి మొలకెత్తి మరిన్నిగోధుమల నుత్పత్తికి కారణభూతము కాగలవు. కాని గోధుమలనొకసారి విసరి పిండిజేసిన వానిలో జీవము నశించి మొలకెత్తు పటిమ కోల్పోబడుతుంది. ఈ విషయంవెనుక దాగిన తత్వమేమిటి? ముడి గోధుమలు వ్యక్తుల అహంకారమునకు, పుణ్యపాప కర్మలకు, ఆయా కర్మఫలములకు విషయవాసనలకు, లోదాగిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది శత్రువులకు సంకేతము. గోధుమలు మొలకెత్తే విధంగా మన...

ఈశోపనిషత్తు పరంగా శ్రీసాయిబాబ స్థుతి.

Image
శ్రీసాయినాథాయనమః. పాఠక భక్తులెల్లరకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు, సాయిబాబా దివ్యాశీసులు! సర్వజ్ఞత సర్వవ్యాపకత సర్వశక్తిమంతమునైన నైన ఆ పరబ్రహ్మ శక్తి సదా పరిపూర్ణమైనది. రూపరహితమైన బ్రహ్మమునుండి మానుషరూపం దాల్చి శిరిడీలో సాయిబాబాగా నడయాడిన పరాశక్తి పరిపూర్ణమైనది. హే సాయినాథా! పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనెడి యచ్చులో పోయగా దానినుండి యోగులలో నలంకారమూగ నీవు ఉద్భవించినావు. మహాసమాధియనంతరము నిరంతరం కొనసాగుతున్న నీ నిర్గుణ నిరాకార శక్తి పరిపూర్ణమైనది. హే పరాత్పరా, సాయిదేవా శరణు శరణు. అశాశ్వితము సదా పరిణామశీలమైన జగత్తులో సంపూర్ణ త్యాగనిరతితో నీవు జీవించినావు. నీ త్యాగబుద్ధి అద్భుతము అమోఘము. దీన జనోద్ధరణమే నీ అవతార కార్య రహస్యము. నీవు నిష్కళంక కర్మయోగివి. భక్తులనుండి ఒక్కటిపొంది వారికి పదింతలగ , నూరింతలగ సాయముగూర్చు దానశీలి శరణు శరణు. నీదివ్యశక్తి,సృష్టి నడుపునట్టి ఆత్మస్థితి. సర్వజీవరాశులయందు చైతన్యరూపుడవై విరాజిల్లు ఓ సాయినాథా శరణు శరణు. ఉపనిషత్తులు ఆత్మఒక్కటిగా పేర్కొన్నవి. ఆత్మ కదలదు, కాని మనసుకన్నా వేగంగా చరించును. ఇంద్రియములకు పట్టుబడదు. చలనరహితముగా నిలబడినను పరుగులెత్...

రక్షకుడు.

Image
శ్రీసాయినాథాయనమః. Wishing all the fathers a vey happy Father's Day. సాయిబాబా కరుణాసాగరుడు, భక్తవత్సలుడు,ఆపద్బాంధవుడు,అనాదరక్షకుడు. ఆ మహామహితాత్ముని లీలల కొన్నింటినిచట స్మరించెదము. " లేదు,అట్లు జరుగనేరదు. నేనే దాని తండ్రిని. నేనిచటనే యున్నాను. పాముచేత కప్పనెట్లు తినిపించెదను? నేనిక్కడ ఊరకనే యున్నానా ? " ఓ ఆగంతుకునితో బాబా అన్న మాటలివి. కర్మఫలంచే కప్పగాజన్మించి శత్రు పామునోటబడ్డ చెన్నబసప్ప పూర్వజన్మలో తన బద్ధ విరోధియైన వీరభద్రప్ప బారినుండి తప్పించుకొనుటకై బాబాను ఆశ్రయించి వారి ఆశీసుల పొందాడు. మాటనిలుపుకొనుటకై బాబా సమయానికివెళ్ళి కప్పనురక్షించాడు. జన్మజన్మల రక్షణ సాయిదేవునిది. శ్రీమతి సదాశివ్ తార్కాడ్ కళ్ళపోటుతో సాయిని దర్శించింది. ఆయన కొద్దిక్షణాలు ఆమె కళ్ళలోకి చూచారు. అప్పటికప్పుడే ఆమె కళ్ళ పోటు తగ్గిపోయింది. నీరు కారడం ఆగిపోయింది. కాని బాబాకనులవెంట నీరు కారసాగింది. ప్లేగువ్యాధిచే మిగుల బాధపడుచున్న తనకురుమారునికై సాయిని ఆశ్రయించినది శ్రీమతి ఖాపర్డే. క్షణాల్లో నాలుగు పెద్దబొబ్బలను తమదేహంపైకి తీసుకొని ఆమెబిడ్డను రక్షించారు సాయినాథులు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఒక భ...

ఘటనల కూర్పు - సాయి దేవుల నేర్పు.

Image
శ్రీసాయినాథాయనమః బాల్యంలో పిల్లలందరం ఓ చిన్న పజిల్ ఆట ఆడేవాళ్ళం. అది దేశపటానికి సంబంధించినది. వేరు వేరు చెక్క ముక్కలుగానుండిన రాష్ట్రాల ను కూర్చి దేశపటం జేయడం. ముందుగా ముక్కలను గుట్టగా వేసి ఆముక్కలను సరియైన స్థానంలో అమర్చి మరల దేశపటం చేయటం. పజిల్ ఆరంభంలో చూసినపుడు ఏ ముక్కలోనూ ఎలాంటి ప్రత్యేకత కనిపింపదు, దేశం అసలే కనపడదు. కాని ఆయా ముక్కలను ఓ వరుస ప్రకారం అమర్చితే చక్కటి దేశపటం దర్శనమిస్తుంది. ఎవరు అతి తక్కువ సమయంలో పజిల్ పూర్తిజేస్తారో వారే విజేతలు. అలాంటి మరో ఉదాహరణ, చిత్రకారుని చిత్రం, ఆరంభంలో ఏవేవో పిచ్చిగీతలుగా కనబడే రేఖలు చివరకు ఓ సుందర మనోహర రూపంగా కాన్వాసుపై రూపుదిద్దకుంటాయి. పజిల్ విజేత లేక చిత్రకారుడే సమర్ధ సద్గురు సాయినాథులు. చిత్రకారుని పిచ్చగీతలె సాయి తమ భక్తులకు సమకూర్చే చిన్న చిన్న ఘటనలు. ప్రధమంగా ఆయా ఘటనలలో ఏ ప్రత్యేకతా కనిపింపదు, కాని ఆపై కొంతకాలానికి వేరువేరుగా జరిగిన ఆ ఘటనల వెనుక ఓ చక్కని లీల గోచరమిస్తుంది. అదే వ్యక్తికి జరిగే అనుభవం. ఆలా జరిగే కొన్ని యనుభవాల పర్యవసానంగా ఆ వ్యక్తి క్రమంగా సాయి మార్గంలో తెలియకనే అడుగులువేసి పిదప సాయి భక్తునిగా పరిణితి చెందుతాడ...

అమ్మల మిన్న యమ్మ సాయి మాయమ్మ !

Image
శ్రీసాయినాథాయనమః! నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవము (Mothers Day). " Mothers were created by God to show us that He loves us with or without cause. " Paramahansa Yogananda. అంతర్జాతీయ మాతృదినోత్సవ వేడుక సందర్భమున మాతృమూర్తులెల్లరకు శతాధిక వందనములు. తల్లి ప్రేమ తల్లికే తెలుస్తుంది, ఆ ప్రేమ ఉహకందదు, వర్ణలకు చిక్కదు. కాని అట్టి ప్రేమను గూడ మించునట సద్గురువు ు తన భక్తులపై జూపెడు ప్రేమ. తల్లిప్రేమను వేయి రేట్లు మించునని స్వామి సమర్ధ అక్కల్కోట్ మహారాజ్ వచించారు. సాయిప్రేమ అలాంటిదే! మాతృమూర్తి ప్రేమానురాగాలు కేవలం తన బిడ్డలకే పరిమితమైతే సాయి ప్రేమ శరణాగతి కోరిన సమస్తమానవాళిపైనే గాక , జీవజంతువులపైనా, సమస్త చరాచర జగత్తుపైనా సదా ప్రసరిస్తుంది. నేటి ప్రత్యేక శుభ సమయమున ఎల్లలెరుగని సాయి తల్లిప్రేమనిచట స్మరించుకొనెదము. తమను జూడ వచ్చిన భక్తుడు బాబాసాహెబ్ మిరీకర్ తో సాయి యిలా అన్నారు, " నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి, ఎవరైతే ఆమె ఒడిలో కూర్చొనెదరో వారిని ఆమె కష్టములనుండి యాతురతలనుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాల దయార్ద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల...

శ్రీమద్భగవద్గీతాసారము 5 - భగవాన్ శ్రీరమణమహర్షి.

Image
శ్రీసాయినాథాయనమః, శ్రీరమణాయనమః. ( Continued ) 37) మానవమానముల యందును, శత్రుమిత్రుల యందును, సముడై, సకల కామ్యకర్మములను విడిచినవాడును లేక సొంత కార్యముల నన్నిటిని విడిచి పరుల మేలుకొరకు ప్రవర్తించువాడును ఎవడో వాడు ' గుణాతీతుడని ' చెప్పబడుచున్నాడు. (14 : 25). 38) ఏ మనుష్యుడైతే తనలో తానే ఆనందించువాడును, తనలో తానే తృప్తిపొందిన వాడును, తనయందే సంతోషపడుచుండు వాడును అగునో వానికి చేయదగిన కార్యమేదియును లేదు. అట్టి ఆత్మారాముడు కృత కృత్యుడని భావము. (3 : 17). 39) అట్టి ఆత్మానందభరితుడగు బ్రహ్మవేత్తకు ఈ లోకమునందు కర్మను చేయుటచేతగాని, కర్మనుచేయకుండుటచేతగాని యెట్టి ప్రయోజనుమును లేదు. వీనికి ఏ ప్రయోజనుములకొరకుగాని సమస్త భూతములలో నాశ్రయింపదగిన దేదియును లేదు. (3 : 18). 40) అప్రయత్నముగా తనంతట లభించిన ఆహారాదులతో తృప్తిబొందిన వాడును, సుఖదుఃఖములవలన హర్షశోకముల నొందని వాడును, ఇతరులపై మాత్సర్యము లేనివాడును, ప్రాప్తాప్రాప్తముల యందు సమబుద్ధి గలవాడునైన యోగి దేహధారణకు అవసరమైన పనులు మాత్రము చేసినను కర్మబద్ధుడు గాడు. (4 : 22). 41) ఓ యర్జునా! మానవులను కీలుబొమ్మలవలె, సర్వాంతర్యామి యగు పరమేశ్వరుడు సకలప్రాణులయొ...