Posts

అందమైన బాబాబడి.

Image
శ్రీసాయినాథాయనమః! పాఠక భక్తులెల్లరకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు! శ్రీసాయిసత్చరిత్ర ముప్పదిరెండవ అధ్యాయంలో సాయిబాబ చదివినబడిగూర్చి వ్రాయబడినది. ప్రస్తుత వ్యాసంలో ఆయావివరములను స్మరించుకొందుము. బాబ తన ముగ్గురు మిత్రులతో కలసి ఓ అరణ్యంలో దేవునిగూర్చి చర్చిస్తు దైవాన్ని వెదక నారంభించారు. దైవ వశాత్తు బంజారా ఒకరు వారిని కలసి సాయంజేయ తలువ కేవలం సాయి మాత్రమే వాని ఆతీధ్యం స్వీకరించారు. ఆపై వారి గురువు ప్రత్యక్షమై కేవలం సాయిని మాత్రమే తమ బడిలో జేర్చుకొన్నారు. ఇందుకు కారణం వెదుక నారంభిస్తే కొన్నివిషయాలు బోధపడగలవు. సాయి మిత్రులు కేవలం పుస్తకజ్ఞానంతో స్వతంత్రంగా ఆలోచించి దైవాన్ని తెలుసుకో దలువ, బాబా మాత్రం పుస్తక జ్ఞానాన్ని నిరసించి మనకు విధించిన కర్మల పూర్తి జేస్తూ దేహాన్ని,మనసును,పంచప్రాణాలను గురుపాదముల బెట్టి మిగుల విశ్వాసంతో శరణువేడవలెనని తమవంతుగా అన్నారు. ఆ నల్వురు దారి కోల్పోయి మిగుల ఆకలితో యున్నప్పటికీ బంజారా ఆతిధ్యాన్ని కేవలం సాయి మాత్రమే స్వీకరించారు, మిత్రులు తిరస్కరించారు. ఇందులకు కారణం సాయి మిగుల ఆకలితో నుండటం. సాయి ఆకలి కేవలం శారీరకం మాత్రమే కాదు. దైవాన్ని తెలుసోకోవాలన్న తీవ్ర వియోగంత...

అహేతు కరుణాసింధు సద్గురు 2.

Image
శ్రీసాయినాథాయనమః! శ్రీరామకృష్ణాయనమః! రామకృష్ణ పరమహంస లీలాక్రమము సాయిబాబమహిమల సమాంతరము. పరమహంస అసంపూర్ణ అవతార కార్యాన్ని సాయిబాబా కొనసాగించారని చెప్పబడినది. రామకృష్ణులు మహాసమాధిచెందిన క్షణంలోనె, సాయిబాబా తమ మూడుదినముల ప్రాణరహిత స్థితినుండి స్పృహలోకి వచ్చారు. పరమహంస భూమిపై కేవలం ఐదుపదుల కాలం జీవించినా, ముప్పది వత్సరముల వయసుకే తమ దైవత్వాన్ని లోకానికి చాటారు. అన్నిమతముల దైవం ఒక్కడనే సత్యాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి లోకానికి తెలియపరిచారు. అటుపిమ్మట లోక కళ్యాణార్ధమై తమలీలా స్రవంతి కొనసాగించారు. వారి జీవిత పఠనం, శ్రవణం భక్తకోటికి అమృతప్రాయం. భక్తుల మానసిక చీకటులకు వెలుగుదీపమై ప్రకాశించారు. ప్రస్తుత కాలంలోని సమాజ రుగ్మతలకు లోనుకాని జీవనవిధానాన్ని బోధించారు. ప్రశాంతజీవితానికుపరరించే పెక్కు సూత్రాల ప్రజలకందించారు. కాంతాకనకాల వలయంలో చిక్కవలదని హెచ్చరించారు. రోగాల నుండి పాపాలనుండి పెక్కురీతుల భక్తుల రక్షించారు.శ్రీ రామకృష్ణుల అహేతు కరుణకు నిదర్శనంగా ఓ భక్తురాలిని పునీతను జేసిన సంఘటను తెలిసికొనిదెము. ఈ ఘటన సోమవారం, జూన్ 4,1883 న దక్షిణేశ్వర్, కాళీ దేవాలయం, పరమహంస నివసించే గదిలో జరిగినది. శ...

అహేతు కరుణాసింధు సద్గురు.

Image
శ్రీసాయినాథాయనమః. సద్గురువులు ఎలాంటి కారణము లేకయె తమ భక్తులపై అపార కరుణాకటాక్షముల రక్షిస్తారు, కాపాడుతారు. వారికి ఆయురారోగ్య సౌభాగ్యములు ప్రసాదిస్తు, మానసిక ప్రశాంతత కల్గిస్తు,అజ్ఞాన చీకటుల తొలగిస్తు శాంతి తృప్తుల సమకూరుస్తు ఆత్మసాక్షాత్కార మార్గంలో మార్గదర్శకులౌతారు. సాయిబాబ,రామకృష్ణ పరమహంస, రమణమహర్షి మున్నగు సద్గురువులు సమీపకాలంలో అవతరించిన అవతారపురుషులుగా తలచవచ్చును. వారు సామాన్యమానవులుగా జన్మించి, సామాన్యమానవులతో సంచరించి అసమాన్య లీలలు జూపారు. అట్టి మహాత్ముల సాంగత్యం పొంది, వారి సన్నిధిలొ నివసించి, వారి దర్శన స్పర్శ భాగ్యం పొందిన భక్తులు నిజంగా ఎంత భాగ్యవంతులోగదా! ఆ మహనీయుల పావన చరితల పఠిస్తూ వారు జీవించిన సమీప కాలంలో నివసించే మనమూ అదృష్టవంతులుగా భావింపవచ్చును. ప్రస్తుత వ్యాసంలో సాయిబాబా మరియు రామకృష్ణ పరమహంసల దివ్యలీలల , వారికి తమభక్తకోటిపై గలఅపార కరుణాకటాక్షముల సంఘటనల కొన్ని స్మరించుకొనిదెము.సాయిబాబ ఆదిభిక్షువుగ అవతరించి అతి సామాన్యంగా పాత మజీదున వసిస్తూ, శిరిడీవీధుల సంచరించి భక్తులనుండి భిక్ష గ్రహించారు. నీళ్ళతొ దీపాలు వెలిగించారు, సంతానహీనులకు బిడ్డల పరంపర సమకూర్చారు,పే...

పుస్తకజ్ఞానము - అనుభవజ్ఞానము 2.

Image
శ్రీసాయినాథాయనమః ! శ్రీరామకృష్ణ యతీంద్రాయనమః ! (Continued from previous post).పండిట్ శశిధర్ శ్రీరామకృష్ణుల కాలంలో పేరొందిన విద్వాంసుడు, విద్యావేత్త,గొప్ప వక్త. ఇతిహాస పురాణాల బాగుగ నెరిగినవాడు. శశిధర్ శ్రీరామకృష్ణ పరమహంస పేరుప్రఖ్యాతులు నెరిగి ఓ రోజు వారిని దర్శింప దక్షిణేశ్వర్ వచ్చాడు. వాని రాకనెరిగిన పరమహంస తమను నిరక్షరాస్యునిగ తలచి పండితునితో సరిగా మాట్లాడగలనొలేదొయని శంకిచి సాయంకోసం విద్యావంతులైన కొందరి శిష్యుల చెంత నుంచుకొన్నారు.కాని పండితుని చూసిన పిమ్మట రామకృష్ణులవారి భావం చిత్రంగా మారిపోయింది, బెరుకు సంకోచాలు మాయమయ్యాయి.ఆతని మందహాసంతో ఆహ్వానించి, మీరు పండితులుగదా ఏదైనా చెప్పండంటూ ఓ విధమైన పారవస్యస్థితిలోకి వెళ్లారు. అపుడాతడిట్లన్నాడు, " అయ్యా! నా మనసంతా పొడిబారిన మెట్టవేదాంతంతో నిండిపోయినది. మీనుండి ఓ లేశ భక్తిభావానుభవము నాశించి మీ చెంతకొచ్చాను. అమృతతుల్య తమ సందేశంకోసం ఎదురుచూస్తున్నాను, దయచేసి నాకో మార్గం చూపండి." అందులకు ఉద్రేక భావంతో శ్రీరామకృష్ణులిలా బదులిచ్చారు " నేనేమి చెప్పగలను, పరబ్రహ్మతత్వాన్నెవరు వివరించగలరు? ఆరంభంలో అర్ధనారీశ్వరంలా ...

పుస్తకజ్ఞానము-అనుభవజ్ఞానము.

Image
శ్రీసాయినాథాయనమః! నేడు బుద్ధపూర్ణిమ. బుద్ధుడు జన్మించిన, ఆత్మానుభూతి పొందిన మరియు నిర్యాణము చెందిన పవిత్ర పర్వదినము. జ్ఞానమంటె ఓ విషయాన్నిగురించిగాని, వస్తువుగురించిగాని లేక వ్యక్తిగురించిగాని తెలిసికొనడము.జ్ఞానము రెండువిధములుగా చెప్పబడినది.మొదటిది పుస్తక జ్ఞానము అనగా పుస్తకపఠనంద్వారా గ్రహించెడి విషయము. రెండవది అనుభవజ్ఞానము. ఇచట వ్యక్తి స్వానుభవముద్వారా విషయాన్ని అవగాహనజేసుకొంటాడు. ఓ చిన్న ఉదాహరణమును పరిశీలించెదము. పంచదార రంగు రుచి వాసనాది గుణగణాలను ఓ పుస్తకం చదివిగాని లేక ఎవరిద్వారానైన వినిగాని తెలిసికోవచ్చును. ఈ విషయమై ఎందరెందరో ఎన్నోవిధముల వర్ణించి లెక్కకుమించిన వ్యాసాలను రాసియుండవచ్చును. కాని ఆ విషయజ్ఞానము వ్యక్తి అనుభవానికందదు, అది కేవలము మానసిక జ్ఞానమే! మరో వ్యక్తి అదే పంచదారను ఓ చిటికెడు నోట్లోవేసుకొన్నాడనుకోండి, అప్పుడతనికి కలిగే తియ్యదనం అనుభవజ్ఞానముగా చెప్పబడినది. ఈ రెండుజ్ఞానముల వ్యత్యాసము పాఠకులు తేలికగా గ్రహించగలరు. ఇదే విషయాన్ని ఆధ్యాత్మిక పరంగా జూస్తే దైవాన్ని గూర్చిగాని, ఆత్మనుగూర్చిగాని, బ్రహ్మజ్ఞానాన్నిగూర్చిగాని గ్రంథపఠనంద్వారా గ్రహించడం పుస్తకజ్ఞానమౌతుంది. ...

సాయి దేవాలయం!

Image
శ్రీసాయినాథాయనమః!పాఠక సాయిభక్తులెల్లరకు శ్రీరామనవమి శుభాకాంక్షలు! సాయి సర్వదేవతా స్వరూపుడని భక్తులయనుభవము. భద్రాచల రాముడు, కాశీపుర హరుడు, కలకత్తా కాళీమాత, బృందావన మురళీధరుడు, అందరి రూపుడు సాయిదేవుడె! రామాలయం ప్రేమాలయం ; దేవాలయం.... సకలదేవాలయం సాయిదేవాలయం ! శ్రవణాలయం శరణాలయం ; శమనాలయం.... ఉపశమనాలయం సాయి దేవాలయం ! మాతాలయం మంత్రాలయం ; మహిమాలయం.... మహిమహిమాలయం మహిమ... హిమాలయం సాయి దేవాలయం ! ప్రణయాలయం ప్రణవాలయం ; ప్రాణాలయం .... భక్త ప్రాణాలయం సాయి దేవాలయం! బాలాలయం బోళాలయం ; బాబాలయం .... శిరిడీ బాబాలయం సాయి దేవాలయం! జ్ఞానాలయం జ్ఞేయాలయం; జ్వాలాలయం .... నిత్యజ్వాలాలయం సాయి దేవాలయం ! ప్రణమామ్యహం ప్రణమామ్యహం; ప్రణమామ్యహం.... దేవ ప్రణమామ్యహం సాయి ప్రణమామ్యహం! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జైజైసాయి! 🌸 Melodious Devotional Translation. Śrī Sāyināthāya Namah Blessed greetings of Śrī Rāma Navamī to all dear Sai devotees! To devotees, Sai is the very embodiment of all deities— The Rama of Bhadrachalam, The Hara of Kashi, Th...

శ్రీసాయిబాబ చిత్రవిచిత్ర సచ్చరిత్ర!

Image
శ్రీసాయినాథాయనమః! "నా చరిత్ర గానమే నీకు శ్రేయస్కరము. అది ఈ భూమిపై నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే! భావయుక్తంగా నా చర్యలు,శక్తులు, గుణాలు మరియు విభూతులను గానం చేసేవారిని , నేను సంపూర్ణముగా రక్షిస్తాను. నా మాట నమ్ము విశ్వాసంతో నన్ను కీర్తించి , నా లీలలు గానం చేసేవారికి పూర్ణమైన ఆనందము శాంతి ప్రసాదిస్తాను." శ్రీసాయిబాబ. ముందుగా పాఠక మహాశయులందరికి నా హృదయపూర్వక నమఃసుమాంజలులు. శ్రీ సాయి సచ్చరిత్ర నా నిత్యపారాయణ గ్రంధము. పెక్కుసార్లు చదివిన పిమ్మట ఓ ఆలోచన కల్గింది. అదేమన నిత్య అధ్యాయ పారాయణము చేయుటకు సమయం లేనప్పుడు కనీసం ప్రతిఅధ్యాయంలోని ఓ లీలను లేక మహిమను స్మరించుకొంటూ సుమారు గంటలోపు పూర్తి లీలా చరిత్ర సారాన్ని సింహావలోకనం జేసిన బావుండునని! ఆ ఆలోచనే నన్నీ రచనకు ప్రేరణ. చిత్రం, వెయ్యిమాటలకు సమమంటారుగావున చదివే సమయంలో లీలను స్ఫురింపజేసే చిత్రాన్ని జతచేయడమైనది. కేవలం చదవడమేగాక రాగయుక్తంగా పాడుకోదలచు భక్తులకనుగుణంగా రచనజేయడమైనది. పాఠక భక్తులకీనా ప్రయత్నమేమాత్రం తృప్తికల్గించినా అది బాబాదీవెనగా భావిస్తాను. వినుడు వినుడు శ్రీసాయికథ,చింతలుబాపే దివ్య కథ! పంతును చెంతకు లాగ...