Posts

శ్రీసాయిసందేశామృతము 51 (Nectar of Sri Sai's message 51)

Image
శ్రీసాయినాథాయనమః ! సమర్థ సద్గురుసాయినాథులు సర్వజ్ఞులు , సర్వవ్యాపకులు , సర్వశక్తిమంతులు , కరుణాంతరంగులు , భక్తరక్షణ దీక్షావ్రతులు . వారినే స్మరిస్తూ శరణుపొందినచొ మనకోర్కెలెల్లదీర్చి తుదకు కోర్కెలేలేని మోక్షమును ప్రసాదింతురు . నిత్యసాయిసచ్చరిత్ర పారాయణమందులకెంతో ప్రయోజనకారి, ఏలన మననిత్యకృత్యములలోని ప్రతిపనికి అందు సమాధానము దొరుకుతుంది . బాబా తమకు తమఫోటోకు తేడాలేదనే యనుభవాన్ని భక్తులకు ప్రసాదించారుగావున మన ఇంట్లోని బాబా చిత్రపటం బాబాతో సమానంగా భావించి తదనుగూనంగా మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి . ఇంట్లోని పెద్దలా, సాయి చూస్తున్నారు , వింటున్నారు నినాదాన్ని సదా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి . మనసాధక బాధకాలు సాయికి తెలిసినా అపుడపుడు మనసువిప్పి ఆయనకు సమస్యలను విన్నవించుకోవాలి . తల్లి తండ్రి గురువు దైవం సర్వం సాయే యను భావన మిగుల ప్రయోజనకారి . అలాంటిసమయాల్లో సాయి ఏదోరూపంలో సాయమందిస్తారు . శ్రీసాయిసచ్చరిత్ర శ్రవణ పఠనాదులు కేవలం పర్వదినాలలోనేగాక అనునిత్యం జరగాలి . లేకుంటే మాయకమ్మేసి మనలనజ్ఞానంలోకి తోసివేస్తుంది, అద్దంపై ధూళిలా అంతరంగంపై మాయపొర ఏర్పడుతుంది. చరిత్రపారాయణ యనే శుద్ధవస్...

శ్రీసాయిసందేశామృతము 50 (Nectar of Sri Sai's message 50)

Image
శ్రీసాయినాథాయనమః ! సాయికథలు చెప్పువారు , వినువారు ధన్యులు . ఇవిమాములు కథలుగావు , భక్తుల అంతరంగ అనుభవముల సంపుటములు . ప్రతికథవెనుక ఓ హితముగూర్చెడి సందేశము , బాబాకరుణావీక్షణ రక్షణాలు మిళితమై వుంటాయి.ప్రస్తుత అంతిమ అధ్యాయములో బాబా పరిపూర్ణ యనుగ్రహముపొందిన భక్తుల యనుభవములు చెప్పబడినవి . కాకాసాహెబు దీక్షితు మహారాష్ట్రలోని ఖండ్వా గ్రామమందు బ్రాహ్మణకుటుంబమున జన్మించాడు . వృత్తిపరంగా న్యాయవాది . మిత్రుడు నానాసాహెబ్ చాందోర్కర్ ద్వారా సాయిబాబా ఘనతవిని మిగుల ఆకర్షితుడై తనకాలి కుంటితనంకంటే మనసుకుంటితనాన్ని పోగొట్టుకొనుటకై సాయిని దర్శింపదలచాడు . కేవలం సంకల్పించడమే దీక్షితు వంతు , అదికూడా బాబా సంకల్పమేమోగదా ? ఆపై అహమ్మదాబాద్ లో శ్యామాను కలవడం, ,మేఘాయొక్క బాబాచిత్రపట దర్శనం , క్రిక్కిరిసి రైలులో మిత్రుడు గార్డుగా ఉండటం, కోపర్గామ్ లో రైలుదిగగానే నానాసాహెబ్ ను కలవడం ,గోదావరిలో స్నానముజేసి శిరిడీ జేరడం మున్నగు సంఘటనలు సాయి సమకూర్చిన సదుపాయాలుగావా ? సాయి ప్రదమదర్శనంలోనే పరమానందాన్నిపొందాడు దీక్షితు . ఈ కలయిక 1909వ సంవత్సరములో జరిగినది . పిదప అచిరకాలంలోనే శిరిడీలో నివసించుటకై దీక్షితు వాడ నిర్మించాడు ....

శ్రీసాయిసందేశామృతము 49 (Nectar of Sri Sai's message 49)

Image
శ్రీసాయినాథాయనమః ! సాయిబాబా సమర్ధసద్గురువు . తమను పరీక్షింపవచ్చిన అవిశ్వాసభక్తులకు అనుభవములకలిగించి వారిలో విశ్వాసం నింపేవారు . ఈఅధ్యాయంలో బాబాను పరీక్షింపవచ్చిన ఇరువురి భక్తులయనుభవాలు ప్రస్తావించబడ్డాయి . మొదటివ్యక్తి బొంబాయికి చెందిన హరి కానోబా బాబాపై నమ్మకం లేనివాడు . స్నేహితులతో కలసి కొత్తచెప్పులు ధరించి జరీ తలపాగాతో ద్వారకామాయికి జేరాడు . బాబాను దర్శించినపిమ్మట యాతనికి వెలుపల మూలన విడిచిన చెప్పులు కనబడకపోవుటచే మిగుల కలవరపడ్డాడు . వాడికి వెళ్ళిభోంచేసినా చెప్పులగురించే వానిచింత. అంతలో ఆశ్చర్యంగా ఓ బాలుడు పోయిన వానిచెప్పులను కర్రకు వేలాడగట్టి " హరీకా బేటా , జారీకా పేటా " యంటూ అరుస్తూ, తనను బాబాపంపారని ఎవరు హరికా బేటాయో, ఎవరు కొత్తజరీపాగా ధరించాడో చూసి వానికా చెప్పులివ్వమన్నారన్నాడు . ఆశ్చర్యముతో కుర్రవానివద్దకెళ్లి తాను హరియను వాని కొడుకునని మరియు తనుధరించిన కొత్త జరీపాగా చూపించి చెప్పులపొందాడు . పరీక్షింపవచ్చిన వానికే పరీక్షబెట్టి వానిలో విశ్వాసం పెంపొందించారు సాయి, కాని ఏమాత్రం వానిపై కోపగించుకోలేదు . భక్తివిశ్వాసాలతో వెనుదిరిగాడు కానోబా . సోమదేవస్వామి యనుసన్యాసి...

శ్రీసాయిసందేశామృతము 48 (Nectar of Sri Sai's message 48)

Image
శ్రీసాయినాథాయనమః ! అధ్యాయము 48. సాయిబాబా శ్రీహరివలె భక్తవత్సలుడు . ఇరువురు తమభక్తులకు అన్యాయం జరిగితే సహింపలేని కరుణామయులు . ఈఅధ్యాయంలో ఈవిషయం మిగుల స్పష్టంగా తెలియగలదు. షేవడే యనువాడు అక్కల్కోటలో న్యాయశాస్త్ర విద్యార్థి, సాయిని నమ్మినవాడు . బాబా దయతో పరీక్షలో తప్పక విజయంపొందగలనని విశ్వసించాడు . కాని వానినమ్మకాన్ని, సాయిని అవహేళనజేసాడు తోటి విద్యార్థి సపత్నేకర్ . ఇదే అతనుజేసిన అనాలోచిత అపచారం . పదేండ్లపాటు అక్కల్కోటలో న్యాయవాదిగా కొనసాగినపిమ్మట యాతని భార్యాపుత్రులిరువురు మరణింప మిగుల వికలమనస్కుడయ్యాడు . వేదాంతం చదివినా పుణ్యస్థలాల దర్శించినా వాని అశాంతి తొలగలేదు . ఆసమయాన పూర్వ మిత్రుడు షేవడే, బాబాపై వాని విశ్వాసం గుర్తుకొచ్చి తన సోదరునితో కూడి సాయిని దర్శింప, బాబా మిగుల కోపించి వానిని తిరస్కరించారు . సంవత్సరకాలం అశాంతికి లోనై కాశివెళ్లదలచిన సమయాన వానిభార్యకు బాబా స్వప్నదర్శనమివ్వ, కలను శుభసూచకంగా తలచి మారిన మనసుతో వారిరువురు సాయిని దర్శించారు . మిగులభక్తిశ్రధ్ధలతో సాయిని సేవించిన పిదప విచిత్రంగా భార్య ఒంటినొప్పులు మాయమయ్యాయి . ముందు తృణీకరించినా ఆపై సపత్నేకర్ పై కరుణజూపి ఆశీర్వద...

శ్రీసాయిసందేశామృతము 47 (Nectar of Sri Sai's message 47)

Image
శ్రీసాయినాథాయనమః ! శ్రీసాయిసందేశామృతము Chapter 47. హత్య, ఋణము,శతృత్వము లకు తప్పక బదులుంటుందనేవారు సాయిబాబా. ఈవిషయాలన్ని వివరించుటకే బాబా ఈ అధ్యాయ కథనెంచుకొన్నారుసాయి . ఈ కథయందు ముఖ్యముగా నలుగురు పాత్రధారులు . వీరందరూ మూడుజన్మలెత్తారు . వారిజన్మలన్నింటికీ సాక్షి సాయి . మొదటిజన్మలో ధనికుడు,వాని భార్య , పేదరాలు దుబ్కీ. పురాతన శివాలయాన్ని బాగుచేయుటకై గ్రామస్తులిచ్చిన డబ్బును సరిగా వినియోగించలేదు పిసినారి ధనవంతుడు . భార్య నగలను అతి తక్కువధరకు కొని బదులుగా పేదరాలు దుబ్కీ నుండి తక్కువ వెలకు పొందిన పనికిరాని బంజరునేలను భార్యకిచ్చాడు . ఆనేల ఆలయపూజారి ఆధీనంలోకి వచ్చింది . ఈవిధంగా ధనికుడు దైవాన్ని , భార్యను , దుబ్కీని మోసంచేశాడు . కాలగమనంలో తుఫానుసంభవించి లోభి వాని భార్య దుర్మరణంపాలయ్యారు . దుబ్కీ కాలగతిచెందినది. మరుజన్మలో ధనికుడు పేదబ్రాహ్మణుడు వీరభద్రప్పగను, వాని భార్య పూజారికూతురు గౌరిగాను, దుబ్కీ గౌరవనింటిలో చెన్నబసప్పగను జన్మలెత్తారు . పూర్వజన్మ ఋణానుబంధమీజన్మలో వారినేకం జేసింది . బాబాసమ్మతితో వీరభద్రప్ప గౌరీల వివాహం జరిగింది . కాని భద్రప్ప పూర్వజన్మవాసనలు కొనసాగాయి , ధనవ్యామోహమేమాత్రం ...

శ్రీసాయిసందేశామృతము 46 (Nectar of Sri Sai's message 46)

Image
శ్రీసాయినాథాయనమః ! భక్తిశ్రధ్ధలున్నభక్తులకు సాయిబాబా నిత్యసత్యులు. సమాధికుముందువలె ఇప్పటికి సాయిలీలలప్రవాహం కొనసాగుతూనేవుంది. తమకు తమ చిత్రపటానికి తేడాలేదన్న వాక్యానికి మరోనిదర్శనం ఈ అధ్యాయవిషయం. ప్రియభక్తులు కాకాసాహెబు దీక్షితు, నానాసాహెబ్ చాందోర్కర్ నాగపూర్ మరియి గ్వాలియర్ లలో తమతమగృహములాజరుగు శుభకార్యములకు సాయినాహ్వానింప, తమకుబదులు శ్యామాను పంపెదమని, వారికంటెముందుగానే గయ జేరేదమన్నారు. శ్యామా అప్పాకోతేయనువానితో పై శుభకార్యములకు హాజరై పిదప కాశీ, ప్రయాగ అయోధ్యల యాత్రముగించి గయజేరి యచట పాండా యింట అతిధులయ్యారు . ఇచట ఆశ్చర్యకరవిషయమేమన పాండా గృహం ముందుహాలులో బాబాచిత్రపటాన్నిజూసి శ్యామా చకితుడయ్యాడు . బాబామాటలు సత్యమయ్యాయి . అంతకు 12 సంవత్సరాల పూర్వము పాండా శిరిడీ దర్శించి బాబాయనుమతితో శ్యామానుండి ఆ పటం పొందాడు . ఈసంఘటన స్మరించిన పాండా మిగుల సంతుష్టుడై శ్యామాను బహు సత్కరించాడు . చిత్రపట విశేషాలను శ్యామా పాండాలు మరచినా సాయి మరువలేదు . సాయి భూత వర్తమాన భవిష్యత్తులెరిగిన సర్వసమర్థులు, కాలాతీతులు . బాబా ప్రేమానురాగాలు కేవలం మానవమాత్రులపైనేగాక సమస్త జీవజంతువులపట్ల వ్యాపించినవి . పరస్పరద్...

శ్రీసాయిసందేశామృతము 45 (Nectar of Sri Sai's message 45)

Image
శ్రీసాయినాథాయనమః ! సమర్ధసద్గురు సాయినాథులు ఆత్మస్వరూపులు , పరమాత్మస్వరూపులు . ఆత్మ మరణరహితము, బాబా మరణరహితులు ! మహాసమాధికి ముందట సాయి దేహసంచారులు , పిదప ఆత్మసంచారులు, సర్వవ్యాపకులు . సమాధి యనంతరము వారిలీలలు యదావిధి కొనసాగటం భక్తులయనుభవ సత్యం . సాయినాథులపట్ల అపరిమిత ప్రేమయే సాధనారహస్యము. భక్తులచే సద్గ్రంథపఠనము జేయించెడివారు బాబా . సమాధియనంతరం భక్తులు పారాయణ కొనసాగిస్తున్నారు . ఒకరోజు ఉదయం బొంబాయి చౌపటిలోని కాకామహాజని యింట్లో కాకాసాహెబు దీక్షితు ఏకనాథభాగవతము చదువుచున్నాడు . ఆదిభక్తిప్రధానమైన ఘటన . అందు నవనాథులు భాగవతధర్మసూత్రాలను జనకమహారాజునకు వివరిస్తున్నారు . నాటి పారాయణసారాంశమేమన హరినామ గురునామ స్మరణలే కలియుగమోక్షసాధనలు . నాటి పారాయణానంతరము, నవనాథులు జూపిన భక్తి సామాన్యులకతిదుర్లభముగా దలచి దీక్షితు మిగుల నిరుత్సాహపడ్డాడు . బాబాలాంటి సద్గురుభక్తులు భక్తివిషయంలో సందేహించుటేలయని పక్కనున్న శ్యామా వ్యాఖ్యానించాడు . కాని దీక్షితు వ్యాకులమనసు కుదుటబడలేదు . ఆశ్చర్యంగా ఇందులకు సమాధానం మరునాడు ఆనందరావు పాఖాడే యనుభక్తుని రాకతో తీరినది . పాఖాడే తనస్వప్నవృత్తాంతం వివరించాడు . నీటమునిగిన బాబాపాదా...