Posts

Showing posts from June, 2019

అంతరాత్మల వెలుగు సాయియే మోక్షము!

Image
శ్రీసాయినాథాయనమః  అంతరాత్మల వెలుగు సాయియే మోక్షము!  మట్టిరా దేహము, మట్టిలోనె పెరుగును  మరల మరల పుట్టుచూ  మట్టిలొనె కలియును మిధ్యరా గేహము, మిధ్యరా లోకము మధ్యలోనె కనిపించి మాయమై పోవును మాయరా నామము, మాయరా రూపము మధ్యలోనె కనిపించి మాయమై పోవును మజిలీరా జన్మము, మజిలీరా బంధము మధ్యలోనె కనిపించి మాయమై పోవును ఆత్మయే సత్యము, ఆత్మయే నిత్యము అంతరాత్మల వెలుగు సాయియే మోక్షము శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జయజయసాయి !

సాయి కథలు - అక్కచెల్లెండ్ర అనురాగము !

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు -  అక్కచెల్లెండ్ర అనురాగము      ఇచట చదువుట ప్రారంభించగనే సాయి కథలలో అక్కచెల్లెండ్ర ప్రస్తావన మెక్కడనుండి వచ్చినదని పాఠకులకో అనుమానం కలుగవచ్చును. ఇందులకు శ్రీసాయిసచ్చరిత్రము లోని 15వ అధ్యాయమును పరిశీలించెదము. ఈ అధ్యాయం లోని విషయంలోకి వెళ్ళితే మన అనుమానం తీరుతుంది. ఓరోజు సాయిబాబా ద్వారకామాయిలొ  కూర్చున్నారు. సాయికెదురుగా ఓ భక్తుడుకూడ కూర్చున్నాడు. ఇంతలో గోడపైని బల్లి టికు టికు మని కూసింది. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలుకులకర్ధమేమని బాబానడిగాడు. అది శుభమా అశుభమాయని ప్రశ్నించాడు. తన చెల్లెలు ఔరంగాబాదునుండి తనను చూడ వచ్చుటయే ఆబల్లి ఆనందానికి కారణమని బాబా చెప్పారు. భక్తునికిదంతయు అయోమయముగా దోచి, అలాగేచూస్తుండిపోయాడు. కాసేపటికి బాబాదర్శనానికై  ఓ వ్యక్తి ఔరంగాబాదునుండి గుఱ్ఱంపై వచ్చాడు.  అలసిన గుఱ్ఱానికి ఉలవలు తెచ్చుటకై  తన సంచిలోని ధూళిని విదిలించాడు. అందులోనుండి ఓబల్లి అందరూ చూస్తుండగా గోడపై కెక్కినది. ప్రశ్నించిన భక్తుడదంతయు కనులప్పగించి చూస్తున్నాడు. వెంటనే ఆబల్లి గోడపైనున్న తనసోదరివద్దకు సంతోషంతో జరజరా పాకుతూ ...

సాయి కథలు - సిత్రాలు, సాయి చిత్రపటాలు!

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - సిత్రాలు,సాయి చిత్రపటాలు! శ్రీసాయిబాబా సర్వవ్యాపి. సమస్తచరాచర జగత్తంతా వ్యాపించియున్నారు. సాయి సర్వదేవ, సర్వ దేవీ, సర్వ యోగి స్వరూపుడేగాక, జంతువులలోను, ఎగిరిపక్షులలోను, కదలని శిల్పంలోను, కదిలే చిత్రపటంలోనూ సర్వత్రా నిండియున్నారు. వారందరిలోని చలనానికి, చైతన్యానికి సాయి స్పందిస్తారన్నది చెప్పుటకు వారిచరిత్రయే   పెద్దసాక్ష్యం!  ప్రస్తుతవ్యాసంలో సాయి చిత్రపట రూపంలొ భక్తులకెలాంటి యనుభవములనిచ్చారను యంశమును పరిశీలంచెదము. నవయుగ తుకారముగ పిలువబడే గొప్పభక్తుడు, సంగీతకారుడుయగు బాలబువ సుతార్ ఒకసారి శిరీడీవచ్చి బాబాకు నమస్కరించగా, వానిని గత నాలుగు సంవత్సరములుగా యెరుగుదునని సాయి చెప్పారు. మొదటిసారిగా శిరీడీ  వచ్చిన సుతార్ కు యీమాటలు అర్ధంకాలేదు. కాని తీవ్రంగా ఆలోచించినపిమ్మట బొంబాయిలో నాలుగు సంవత్సరముల క్రిందట బాబా ఫొటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అంటే బాబా తమ ఫోటోకి, తమకు ఎలాంటి తేడా లేదని, భక్తితో తమఫోటోకు నమస్కరించినా యది తమకామోదయోగ్యమని చెప్పకనే చెప్పారు.  ఇక మరోవిచిత్రం చూద్దాం. 1917వ సంవత్సరం హోళీ పండుగనాడు, బొంబ...

సాయికథలు - చిత్తం శివునిపైన, భక్తి చెప్పులపైన!!

Image
శ్రీసాయినాథాయనమః  సాయికథలు - చిత్తం శివునిపైన, భక్తి చెప్పులపైన! సాయిబాబాను చూచుటకు తండోపతండములుగా ప్రజలు తరలి వచ్చేవారు. కొందరు పరిపూర్ణ భక్తివిశ్వాసాలతో , కొందరు తమ సమస్యల పరిష్కారానికై, కొందరు బాబాను పరీక్షించుటకు యిలా వేరు వేరు భావాలతో సాయిని దర్శించేవారు. సాయి సర్వజ్ఞులు, సర్వసమర్దులు గావున వచ్చెడివారి   అంతరంగములకనుగుణంగా  వారికి యనుభవముల నిచ్చెడివారు. సాయిబాబాను దర్శించిన బొంబాయి పెద్దమనిషి హరి కానోబా పైన చెప్పబడిన మూడవ వర్గానికి చెందినవాడు. బాబా ఘనతను ఇతరులనుండి విన్ననూ, యాతనికి నమ్మకము కుదురలేదు, సంశయాత్ముడు. కావున స్వయంగా బాబాను పరీక్షించుటకై ద్వారకామాయికి, చక్కని జలతారు తలపాగా ధరించి, అప్పుడేకొన్న కొత్తచెప్పులు వేసుకొని వచ్చాడు. చెప్పులు కొత్తవిగావున యతని శ్రద్ధ వాటిపైనే నిలబడింది. వాటిని జాగ్రత్తగా ఓమూలన బెట్టి సాయిని దర్శింప వెళ్ళాడు. బాబాకు భక్తితో నమస్కరించి ఊది ప్రసాదములు పొంది వెనుదిరిగాడు. అంతలోనే వింతగా యాతడచట యుంచిన కొత్తచెప్పులు మాయమయ్యాయి. ఎంతవెదికినా కనబడక పోవుటచే శిరిడీ వచ్చిన ఆనందం కూడా మరచి  మిగుల చికాకుతో బసకు వచ్చాడు. తన బసల...

సాయి కథలు - కలలతో కర్మనివృత్తి !

Image
శ్రీసాయినాథాయనమః! సాయి కథలు - కలలతో కర్మనివృత్తి  శ్రీసాయిబాబా బోధలు మెలకువలోనేగాక, స్వప్నావస్థలోగూడ కొనసాగడం భక్తుల అనుభవ విషయం. కలలద్వారా తన భక్తులకు  బోధయేగాక, బాధానివారణ జేసిన సంఘటనలను  శ్రీసాయిసచ్చరిత్రము, పదమూడవ అధ్యాయంలో   చూస్తాం. సాధారణంగా జీవితంలో వచ్చే కష్టసుఖాలు పూర్వజన్మ కర్మఫలాలపై ఆధారపడియుంటాయనుట పెద్దలమాట. చెడుకర్మ ఎంత బలీయంగాయుంటే బాధలుగూడ అంతబలీయంగా వుంటాయి. భక్తులు భరింపలేని కష్టాలను సాయి స్వయంగా తమపై వేసుకొని యనుభవించెడివారు. అందుకే ఏకాదశసూత్రాలలో, భక్తుల బరువుల తానుమోయుదునని  సాయి చెప్పియున్నారు. అనగా బరువులో చాలవరకు తాముస్వీకరించి, నామమాత్రంగా భక్తులు యనుభవించునటుల జేసెడి సమర్థులు, కరుణామూర్తులు శ్రీసాయినాథులు. తమ స్వప్నాలలో స్వల్పపాటి బాధయనుభవించి తమపూర్వజన్మ పాపములనుండి ముక్తులైన భక్తుల యనుభవాలు మనల నాశ్చర్య పరుస్తాయి. అలాంటి ఓఅనుభవాన్నిచట స్మరించుకొందాము. పూనాజిల్లా  నారాయణగావ్ కు  చెందిన భీమాజీపాటిలు భయంకరమైన క్షయవ్యాధి పీడితుడై, బాబాభక్తుడు నానాసాహెబ్ చాందోర్కర్ సలహాపై  షిరిడీవెళ్లి సాయిని శరణుకోరాడు. ఆజబ్...

సాయి కథలు - ముందు ముచ్చట్లు, వెనుక చప్పట్లు !

Image
శ్రీసాయినాథాయనమః  సాయి కథలు - ముందు ముచ్చట్లు, వెనుక చప్పట్లు  లోకవ్యవహారం చాలచిత్రంగా యుంటుంది. కొందరు వ్యక్తులు తమపరిచయస్తులు  ఎదురైనప్పుడు ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో మాట్లాడతారు, కాని వారు ప్రక్కకు వెళ్ళగానే వారిగురించి చాల చులకనగా  మాట్లాడతారు, అందుకే ' ముందుముచ్చట్లు, వెనుక చప్పట్ల ' ను సామెతవచ్చింది. సాధారణవ్యక్తులపట్ల యేమోగాని, సద్గురువులపట్ల అలావ్యవహరించడం సదావర్జనీయము!  శ్రీసాయిసచ్చరిత్ర, 21వ అధ్యాయంలో ఇందులకు సంబంధించిన ఓ చక్కని ఘటన వుంది. ఓరోజు పండరి నుండి యొక ప్లీడరు ద్వారకామాయికి వచ్చి  వినయంగా సాయిపాదములకు  ప్రణామములాచరించి , దక్షిణ సమర్పించి అచట జరుగు వ్యవహారముల గమనిస్తూ ఓమూల కూర్చున్నాడు. మనలాంటి సాధారణవ్యక్తులకు ఈవిషయం మామూలుగ యుంటుంది. కాని సర్వజ్ఞులు కావున వారికీ  అందరి అంతరంగాలు తెరచిన పుస్తకాలే! బాబా ఆ లాయరు వంక చూస్తూ యిలా అన్నారు, " ప్రజలెంత మోసకారులు?  వారు పాదములపై పడుదురు, దక్షిణలర్పింతురు , కానీ చాటున హేళన చేయుదురు. ఇది ఎంత విచిత్రము? "  ఈ బాబామాటలు ప్లీడరుకు సూటిగా తగిలాయి. అచటనున్న వారలకీవిషయమేమీ బోధపడ...

సాయి కథలు - చక్కెరలేని చోల్కర్ చాయ్ !

Image
శ్రీసాయినాథాయనమః చక్కెరలేని చోల్కర్ చాయ్ !  శ్రీసాయి బాబా సర్వాంతర్యామి, సర్వసమర్థులు, తనవారల ఎంతదూరమైనా తాడువేసి లాగుతారు. వేరు వేరు భక్తులు వేరు వేరు మిషలతో సాయిని దర్శించి ధన్యులైనారు. దాసగణు మహరాజు సాయిని తన హృదయం నిండా నింపుకొన్న ఉన్నతభక్తుడు, పరవశంతో సాయిని స్తుతించిన మధుర గాయకుడు, హరిదాసుడు. తన సాయిగానామృతమును పదుగురికి పంచి ఎందరో వ్యక్తులను సాయిభక్తులుగా మార్చిన ధన్యుడు. ఓరోజు ఠాణాలోయున్న కౌపీశ్వరాలయంలోతన హరికథాకార్యక్రమంలో భాగంగా సాయి మహిమను శ్రావ్యంగా పాడుచున్నాడు. కథవినుటకు వచ్చిన శ్రోతలలో చోల్కర్ యనునాతడున్నాడు. సాయిమహిమను విని పులకించిపోయాడు. ఆర్ధిక సమస్యలతో సతమతమగుతున్న యాతడు వెంటనే మనసులో బాబానుధ్యానించి ఇలా మొక్కుకొన్నాడు. "  సాయిబాబా! నేను మిగుల పేదవాడను. తాత్కాలిక  చిన్న ఉద్యోగంతో  నా పెద్ద కుటుంబమును మోయలేకున్నాను. మీ దయచే ప్రభుత్వ పరీక్షలో నుత్తీర్ణుడనై, స్థిరమైన నౌకరీ లభించినచో, నేను శిరిడీ వచ్చి మీకు సాష్టాంగ ప్రణాములాచరించి, మీపేర కలకండ పంచెదను."  చోల్కర్ మనసులోని వేదన  సాయికి వినబడినట్లున్నది, సాయి దీవెనచే  యాతడు ప...

సుందర శిల్పం - సాయి సంకల్పం!

Image
శ్రీసాయినాథాయనమః  సుందర శిల్పం - సాయి సంకల్పం! శిరిడీలోని సమాధిమందిరంలో, బాబాసమాధి వెనుకప్రక్కగా ప్రతిష్ఠింపబడిన సాయి సుందర విగ్రహమునుజూసి తన్మయులుగాని వారుండరు. సజీవరూపంగా  పరిపూర్ణచైతన్య వంతమైన బాబాను చూచునట్టి యనుభూతి భక్తులకు కలుగుతుంది. అందరి అంతరాత్మల యలరు చైతన్యతరంగమే శ్రీ సాయిబాబా. భక్తుల అంతరంగముల చైతన్యపరచి ప్రేరణగూర్చి ,  తమ సంకల్పముల నెరవేర్చుకొనెడి కుశలకర్ములు శ్రీసాయినాథులు. బాబాసుందర మూర్తి నిర్మాణంలో వారి  సంకల్పప్రభావమెలా పనిచేసిందో ఇచట పరిశీలించెదము. ఓరోజు బొంబాయి నౌకాశ్రమములోనికి ఇటలీ దేశం నుండి పెద్దచలువఱాయి శిల వచ్చినది. ఆలాపడియున్న శిలను ఎవరూ గ్రహింపకుండుట జూసి , నౌకాశ్రమ యజమాన్యం వేలం వేస్తే, ఓవ్యక్తికొని షిర్డీ సంస్థానమువారికి సమర్పిస్తాడు. సంస్థానమువారు ఆశిలను బహువిలువైనదిగా నెఱింగి, ఆ శిలనుపయోగించి  బాబా మూర్తిని చేయించాలని తలచారు. ఇందులకై వారు బొంబాయికి చెందిన సుప్రసిద్ధ శిల్పి బాలాజీ వసంత తాలిం ను సంప్రదించి వానికీపవిత్రకార్యము నప్పగించారు.  శిల్పి సాధారణముగా  ఓ నమూనా శిల్పాన్నిచెక్కి, దాని ఆధారంగా అసలు శిల్పాన్ని త...

సాయికథలు - రెండు వంకాయలు

Image
శ్రీసాయినాథాయనమః  సాయికథలు - రెండు వంకాయలు  సాయిబాబా భక్తులపై ప్రేమ అపారమైనది. భక్తుల హృదయాలలోని ఆలోచనలు, అవసరాలు అన్నియు బాబా కెఱుకయే! భక్తులు తమకు ఏమితెచ్చారు, ఎంత తెచ్చారు అనే భావం గాక  యెలాంటి భక్తిశ్రద్ధలతో తెచ్చారనేదే బాబాకు ప్రధానం. ప్రస్తుత విషయానికొస్తే, బాంద్రానివాసి రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ బాబాభక్తుడు. ఆయనభార్య శ్రీమతి సీతాదేవి తార్ఖడ్, బాబాను మిగుల ప్రేమించెడిది. శిరిడివచ్చినపుడుగాని, బాంద్రలోనున్నపుడుగాని బాబాకేదైనా ఆహారపదార్ధాలు సమర్పించడం ఆమెకెంతో యిష్టం. ఓ పర్యాయం బాంద్రానివాసియే యగు మరొక బాబా ప్రియ భక్తుడు రఘువీర భాస్కర పురంధరే భార్యతో షిరిడీ వెళ్ళుచున్నాడు. అపుడు శ్రీమతి తార్ఖడ్,  పురంధరే భార్యకు రెండు పెద్దవంకాయలనిచ్చి, ఓ వంకాయతో పెరుగు పచ్చడి  మరొక వంకాయతో వేపుడు చేసి బాబాకు సమర్పించవలసినదిగా కోరినది. శిరిడీ జేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగు పచ్చడిమాత్రమేజేసి బాబా భోజనసమయానికి  తీసుకెళ్లింది. బాబాకి  ఆ పచ్చడి చాలానచ్చినందున అందరికి పంచారు. వెంటనే, తనకు వంకాయ వేపుడుకూడ అప్పుడే కావలెనని  బాబాకోరారు. ఆకాలంలో శిరి...

మసీదుమాయి బాకీని కోరును

Image
శ్రీసాయినాథాయనమః  "ఇవ్వదలచువారలను, బాకీయున్నవారాలను మాత్రమే బాబా దక్షిణ యడుగుచుండెను. ద్వారకామాయి బాకీని కోరును. బాకీవున్నవారు చెల్లించి , రుణవిమోచనమును పొందెదరు." ఒక రోజున గోవానుండి ఇద్దరు పెద్దలు బాబాదర్శనానికై ద్వారకమాయికి వచ్చి  బాబాకు సాష్టాంగ నమస్కారం చేయగ , బాబావారిలొ కేవలం ఒక్కనినుండి మాత్రమే 15 రూపాయల దక్షిణ అడిగి తీసుకొంటారు. రెండవపెద్ద తనకుతానుగ 35 రూపాయల దక్షిణ యిస్తే బాబా తిరస్కరించారు. ప్రక్కనున్న శ్యామాకిదంతయు బోధపడక అట్లేల చేసారని బాబాను ప్రశ్నించాడు. సర్వజ్ఞులైనబాబా ఇలాచెబుతారు, " శ్యామా! నేనెవరినుండి ఏమియు తీసికొనను. మసీదుమాయి బాకీని కోరును. బాకీయున్నవాడు చెల్లించి, ఋణముక్తుడగును. ఋణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము  తప్పక చెల్లింపవలెను. " శ్యామా తరువాత ఆపెద్దలనుండి దానికి వివరణకోరి, తెలుసుకొంటాడు.  మొదటివాడు ప్రథమంలో పేదవాడు, ఉద్యోగము దొరకినచో మొదటి జీతం తన ఇష్టదైవమైన దత్తదేవునికివ్వ సంకల్పిస్తాడు. ఉద్యోగం దొరికి క్రమంగా వానిజీతం 15 రూపాయలనుండి 700 వరకు పెరుగుతుంది. అలా ధనవంతుడై తన మొక్కును మరిచాడు. తన కర్మఫలంచే బాబాను చూడరాగా, మరచిన...

స్త్రీ మూర్తులపట్ల సాయిబాబా మాతృప్రేమ!

Image
శ్రీసాయినాథాయనమః స్త్రీ మూర్తులపట్ల  సాయిబాబా మాతృప్రేమ! సాయిబాబా జీవితకాలంలో యెందరో భక్తులు సాయిని మిగుల భక్తిశ్రద్ధలతొ సేవించారు. పురుషులతో సమానంగా ఎందరో స్త్రీలు సాయికి మిగుల యనుంగు భక్తులు, సేవికలు ఐనారు. ఈ విషయాన్ని శ్రీసాయిసచ్చరిత్రములో  చూడగలం. ప్రస్తుతం సాయిని సేవించి, వారి కృపకు పాత్రులైన కొందరి మహిళామతల్లుల యనుభవముల పరిశీలించెదము. బాయిజాబాయి  సాయి శిరిడీ వచ్చిన తొలిరోజుల్లో వారిగొప్పతనమును గ్రహించి సేవించిన వారిలో తాత్యాకోతే పాటిలుతల్లి బాయజాబాయి ముఖ్యురాలు. సాయిని తనతమ్మునిలా ప్రేమించెడిది. సాయి ఒచోటున స్థిరంగా యుండక సమీప చిట్టడవులలో తమ అన్నపానీయములు కూడ  మరచి సంచరించేవారు. బాయిజాబాయి ప్రతిరోజు తలపై ఒకగంపలో బాబాకొరకై రొట్టె కూర పెట్టుకొని చిట్టడవిలోని ముండ్లపొదలను సయితము లెక్కింపక దూరదూరములు నడచి బాబాను వెదకి పట్టుకొని మిగుల భక్తిశ్రద్ధలతో, ప్రేమాదరములతో వారికి భోజనము పెట్టుచుండెడిది. ఎనలేని ఆమె సేవను బాబా తుదివరకు మరువలేదు. ఆమెసేవకు ప్రతిగా యామెపుత్రుడు తాత్యాను మిగుల ఆదరించి ఉద్ధరించారు. తమతుదిశ్వాసవరకు తాత్యాను కంటికిరెప్పలా రక్షించారు....