సాయి కథలు - సాయిసన్నిధి, చిక్కుముడి పరిష్కారము
శ్రీసాయినాథాయనమః నేడు పరమపూజ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజగారి జయంతి సాయి కథలు - సాయిసన్నిధిలో చిక్కుముడి పరిష్కారము " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము సాయి భక్తులచే ప్రేమగా పిలవబడే సాయిమాస్టారు ( శ్రీ ఎక్కిరాల భరద్వాజ) గారి చిన్ననాటి అనుభవమిది. కౌమారదశనుండి వారిని ఓ ప్రశ్న నిత్యం వేధిస్తూ ఉండేదట, వివరాల్లోకెళదాం. ఇది ధర్మానికి సంబంధించిన సందేహం. విషయానికొస్తే రామాయణ గాథలో శ్రీరామచంద్రుడు ధర్మాచరణకు మారుపేరు, ఆయనకు సకల శాస్త్రాల, ధర్మాల విశేష జ్ఞానముంది. రాజ్యాభిషేకానికి సంబంధించి, రాజు తదనంతరము రాజ్యము పెద్దకొడుకునకు సంక్రమింపవలె. కాని తండ్రి దశరథుడు తన మూడవ భార్య కైకేయి కిచ్చిన మాటచే భరతునకు రాజ్యం సంక్రమిస్తుంది. ధర్మపరంగా, న్యాయపరంగా రాజ్యాధికారానికి తామే అర్హులమని శ్రీరామునకు తెలిసినప్పటికీ, పితృవాక్య పరిపాలన ( పెద్దలమాటను పాటింపవలె ) ననెడి మిషచే భరతుని రాజునిజేసి తాను సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికెళ్తాడు. ఈ ఘటన రామాయణ కాలంలో జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇపుడు మహా...