Posts

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.

Image
శ్రీ సాయినాథాయనమః ! శ్రీరామచంద్రాయనమః ! పాఠకభక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు! శ్రీరామచంద్రుడు రాక్షసుల సంహరించి యజ్ఞమును కాపాడిన యనంతరము విశ్వామిత్ర సీతాలక్ష్మణుల తోడ జనకపురికి బయలుదేరుతాడు . శ్రీరాముడు మార్గమధ్యమున ముని చూపిన శిలలా పడియున్న అహల్యను తనపాద స్పర్శచే స్పృశిస్తాడు . శాపవిమోచనానంతరము తపస్వియగు అహల్య శ్రీరాముని పీతాంబర ధారియై చతుర్భుజముల శంఖ చక్ర గదాపద్మముల ధరించి మందహాసముతో కమలములవంటి కన్నులతో వక్షమున శ్రీవత్సచిహ్నముతో దశదిశల ప్రకాశింపజేయు నీలమణి దివ్యాకాంతితో ధనుర్బాణముల ధరించి లక్ష్మణునితో నిలిచియున్నవానిగా చూచి హర్షవిహ్వలయై విప్పారిన నేత్రములతో శ్రీరాముని రమానాథుడు పరమాత్మయగు నారాయణునిగా తెలిసికొని ఆర్ఘ్య పాద్యములతో పూజించి దండప్రణామములుజేసి నిలుచుండి రాజీవలోచనుడైన రామునిజూసి,సర్వాంగములు పులకింప గద్గద స్వరంతో ఇట్లుస్థుతించెను. " జగన్నివాసా ! మీచరణకమల రజాకణము స్పృశించి నేను కృతార్థురాలనైతిని . ఆహా ! నా అదృష్టమేమనవచ్చును! బ్రహ్మ ఈశ్వరుడు మొదలగు లోకపాలకులే శుద్ధమైన మనసుతో ఈ పాదరాజమును వెదకుచుందురు . రామా ! నీలీలలు కాదు విచిత్రమైనవి . నీవు మానుషవేషము...

శ్రీరామచరిత మానసము (తులసీరామాయణము) : రామనామ మహిమ .

Image
శ్రీసాయినాథాయనమః ! నేడు " విశ్వావసు " నూతన తెలుగు ఉగాది (యుగాది/కొత్తయుగారంభము) పండుగ . రామనామము తలువకుండ శ్రీరాముని రూపమునూహింపలేము. కేవలము నామస్మరణచే హృదయమున సుందరరూపము దర్శింపగలము. సగుణ నిర్గుణ రూపాలకు సాక్షిభూతము నామము . అంతరంగికంగాగాని బాహ్యంగాగాని వెలుగు కావాలంటే రామనామ మణిని సదా వెలిగించు . సదానామజపముచే వివేకి బ్రహ్మ మాయనుండి ముక్తుడగును . నామరూపాలకతీతమైన అనుపమము , అనిర్వచనీయము మరియు అనామమునైన బ్రహ్మానుభూతి పొందును . అతిరహస్యపు భగవంతుని నిజరూపము కాంషించు ముముక్షువు నామజపంచే దైవాన్ని తెలియగలడు . సిద్ధులనాశించు సాధకుడు వాటిని పొందగలడు . బహుకష్టములనుండి ఆర్తుడు ముక్తుడగును . భగవంతునతిభక్తితో ధ్యానించు జ్ఞాని, పరమాత్మకత్యంతప్రియుడు . ఈవిధముగా నాలుగువిధములైన సాధకులకు నామమే ఆధారము . కలియుగంలో నామస్మరణమే అత్యంత విశేష ఫలదాయిని , ఇందేమాత్రపు సందేహములేదు . ప్రియభక్తుడు నిరంతరం రామనామామృతాన్ని ఆస్వాదిస్తుంటాడు . సాకార , నిరాకార రూప ఆరాధనలకంటే నామస్మరణం బహు శక్తివంతమైనది . అంతేకాదు , సాకార మరియు నిరాకార దైవాన్ని తెలియడం సులువుకాదు . కాని నామభజనచే ఈ రెంటి ర...

దొంగల పసికట్టు , శాంతికదె తొలిమెట్టు !

Image
శ్రీసాయినాథాయనమః , ఈనాడు శ్రీభరద్వాజమాస్టారు సద్గురుసాయిసమాధిమందిరమున ఆత్మానుభవము పొందిన సుదినము. పూజ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారి సమాధిమందిరము,ఒంగోలు . " నా కథలు బోధలు విన్నభక్తులకు భక్తివిశ్వాసములు కుదురును . వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు , " శ్రీసాయిబాబ. బాబా తమభక్తులకిచ్చెడి బోధామృతము బహువిధములు . తమజీవన విధానముద్వార, ప్రసంగములద్వార, ప్రకటిత లీలద్వార, స్వప్నసందేశములద్వార, చిన్నచిన్న కథలద్వార భక్తులకు సందేశమందించేవారు.బాబా 16-1-1912 న చెప్పిన ఓ కథ : " ఒకప్పుడు నావద్దనున్న ధనాన్ని అపహరించడానికి ఎంతోమంది వచ్చారు . నేను వారినేమీ అనక ధనాన్ని తీసుకు పోనిచ్చాను . కాని వారి పేర్లను మాత్రం గురుంచుకున్నాను . తర్వాత ఒకచోట దొంగలంతా భోజనాలకు కూర్చోగానే వారందర్ని కనిపెట్టి రహస్యంగా వెంబడించి వారందరిని హతమార్చి నా ధనాన్ని తిరిగి తెచ్చుకున్నాను . " వివరణ : వివేక వైరాగ్యాలు , ధ్యానములే ధనం. రజస్తమో గుణాలవలన హృదయంలో దాగిన పూర్వపు మలిన సంస్కారాలే దొంగలు . అవి మనసును చంచల పరచడమే ధనాన్ని అపహరించడం. అప్పటికప్పుడే మనసును నిగ్రహించుకుని ఆ సంస్కారాలను...

కల్లలుకాని కలలు 2.

Image
శ్రీసాయినాథాయనమః ! శ్రీసాయినాథాయనమః ! శ్రీసాయిబాబ భక్త రక్షణ మరియు స్వప్నసందేశాలు వారి సమాధి యనంతరము నేటికిని కొనసాగుతున్నవి . భక్తులు నిత్యనూతన అనుభవాలను పొందుచున్నారు . ప్రస్తుతము వివరింపబడిన లీలలు శ్రీసాయిసచ్చరిత్ర మరియు శ్రీసాయిలీలామృతము నుండి సేకరించడమైనది . గగనతలంపై తళుకులీను అసంఖ్యాక నక్షత్రాలవలె వారి మహిమలకంతులేదుగదా! సాయిబాబాను సజీవంగా సేవించిన పరమభక్తుడు కాకాసాహెబు దీక్షితు, బాబా సమాధి యనంతరం బొంబాయి చౌపాటీలో నున్న కాకాసాహెబు యింటిలో ఏకనాథభాగవతము చదువుచున్న సమయాన ఓ సందేహం కలిగింది. నవనాథుల భక్తి మిగులగొప్పదని , కాని అలాంటి భక్తి తమలాంటి సామాన్యులకు కలగదని మిగుల వాపోయాడు . కాని పక్కనున్న శ్యామా అందులకాక్షేపణ తెలుపుచూ, సాయిని విశ్వాసంతో సేవించిన భక్తులకా భయాందోళనలేలయని నొక్కిచెప్పాడు. అందులకు నిదర్శనంగా మరునాడు ఆనందరావు పాఖాడే యనుభక్తునికి సాయి స్వప్నదర్శనమిచ్చి శ్యామామాటల ధ్రువపరస్తూ ఆశీర్వదించి శ్యామాకు పట్టుపంచొకటి దానం చేయమన్నారు . బాబాసందేశంతోను, పట్టుపంచెతోను పాఖాడే, కాకామహాజని యింటికి పారాయణ సమయాన వెళ్లి బాబా సందేశం వివరించాడు . దీక్షితు తగిన సమాధానంపొంది తృప్త...

కల్లలుకాని కలలు ! పాఠక భక్తుల నూతనసంవత్సరపు కలలు శ్రీసాయిబాబా కృపచే సాఫల్యమగుగాక !

Image
శ్రీసాయినాథాయనమః ! కలలు కల్లలంటారుగదా , మరిదీన్నిగూర్చి మాట్లాడుకోవడమెందుకనే ప్రశ్న పాఠకులకు రాకమానదు. లోకంలోని ఈ నానుడి నిజమైనా బాబా విషయంలో ఇందులకు విరుద్ధంగా తోస్తుంది. ఎందరో భక్తులకు బాబా కలల రూపంలో సందేశమిచ్చినట్లు శ్రీ సాయిసచ్చరిత్రలో చూడగలము. మనిషి చైతన్యం నాలుగు స్ధితులలో వ్యాపించినట్లు చెప్పబడుతుంది . అవి వరుసగా మెలకువ , స్వప్న , స్వప్నరహిత దీర్ఘ నిదుర మరియు ఈ మూడు స్థితులదాటిన నోటితో వివరింపలేని భావాతీత నాల్గవ స్థితి. ఈ భావాతీత స్థితి కేవలం అనుభవ గ్రాహ్యమేగాని ఎలాంటి వివరణకందని నిధి . భక్తులకు ఈ నాల్గు దశలలోను బాబానుండి సందేశాలు లభిస్తుండేవి,ప్రస్తుతకాలంలోను కొనసాగుతున్నవి. ఏకకాలంలో అన్నిస్థితులనున్న వివిధ వ్యక్తులకు,భక్తులకు సందేశమివ్వగల సర్వ సమర్థులు సాయిబాబ. సాగరం, ఏకకాలంలో వేర్వేరు ప్రదేశాలనున్న విభిన్నమైన నాలుగు నగరాల తాకగలదుగదా, అదేవిధంగా సర్వవ్యాపి సాయి అన్నిస్థితులనున్నవారికి తమబోధన సుత్రాన్నందింపగలరు . ప్రస్తుత వ్యాసంలో కలలరూపంలో బాబా సమకూర్చిన అమృతానుభవాలను స్మరించుకొనెదము . ఈ వివరములు శ్రీ సాయి సచ్చరిత్రమునుండి గ్రహించడమైనది. రామభక్తుడైన ఓ డాక్...

How a Jnani looks at the world?

Image
Sri Sainathayanamah! Sree Ramanadevayanamah! Today is 145th Jayanti of Sri Bhagavan Ramana Maharshi. How a Jnani(enlightened person) looks at the mind in its three states? Bhagavan answers:For a Jnani there is no difference in the three wakeful,dream and deep sleep states; as the mind is dissloved and lost in the light of conciousness. For Jnani all these states are equally unreal. But the ajnani(unenlightened) person is unable to comprehend this, because for him the standard of reality is the waking state, where as for the Jnani the standard of reality is reality itself. The reality of pure consciousness is eternal by its nature and therefore subsists equally during what you call waking,dreaming and deep sleep. To him who is one with that reality there is neither the mind nor its three states and,therefore,neither introversion nor extroversion. His is the ever-waking state,because he is awake to the eternal Self; his is the ever-dreaming state,because to him the world is no better ...

జామపండ్లు , చిక్కుడుకాయలు.

Image
శ్రీసాయినాథాయనమః! సాయిబాబానుగూర్చి మాట్లాడుతుంటే ఈ జామపండ్లు , చిక్కుడుకాయలు ఎక్కడినుండి వచ్చాయనే సందేహం పాఠకులకు రాకమానదు. కాని శ్రీసాయిసచ్చరిత్ర చదివిన వారలకు ఈ విషయం కొద్దిగా తెలిసేవుంటుంది. అదేంటో పరిశీలిద్దాం. బొంబాయిలో నివసించే లాలాలక్ష్మీచంద్ బాబా స్వప్న దర్శనముచే ప్రేరణపొంది శిరిడీ వెళ్లాలని తలుస్తాడు. అదే రాత్రి ఆతని మిత్రుడు శంకరరావు తలుపుతట్టి శిరిడీ వస్తావా యని అడగ్గా మిగుల ఆశ్చర్యానికి లోనవుతాడు. పిమ్మట పినతండ్రి కొడుకువద్ద 15 రూపాయలు అప్పుజేసి మిత్రునితో బాబానుచూడ రైల్లో బయలుదేరాడు. తోటిప్రయాణీకుల నుంచి బాబా గొప్పతనము తెలిసికొన్నాడు.కోపర్ గాం లో రైలుదిగ గానే బాబాకై కొన్ని జామపండ్లు కొనాలనే ఆలోచనవచ్చింది. కాని అచటి ప్రకృతి సౌందర్యానికి పరవశుడై ఆవిషయం మరిచాడు. శిరిడీ సమీపిస్తున్నప్పుడావిషయం గుర్తొచ్చింది . అదేసమయంలో ఓ ముసలమ్మ నెత్తిపై జామపండ్ల బుట్టతో తమ గుఱ్ఱపుబండి వెంట పరుగెత్తుకొని రావడం గమనించాడు. కొన్నిజామపండ్లుకొని బాబాను దర్శించి మిగుల ఆనందభరితుడయ్యాడు. బాబాసన్నిధిలో లక్ష్మీచందు మరిన్ని అనుభవాల పొందాడు. లాలా కథద్వారా బాబా మనకెలాంటి సందేశమిస్తున్నారు? శిరిడీ వె...