Posts

శ్రీసాయిసందేశామృతము 31 (Nectar of Sri Sai's message 31.)

Image
శ్రీసాయినాథాయనమః ! బాబాసన్నిధి భక్తులకు పెన్నిధి ! సర్వదేవీదేవస్వరూపులుగా బాబా భక్తులకనుభవమిచ్చారు. కావున వారున్న శిరిడీ క్షేత్రము పరమపావన తీర్థము ! అదియే వైకుంఠము , కైలాసము . శిరిడీలో సాయిని సేవిస్తూ తుదిశ్వాసవిడచిన కొందరి పుణ్యాత్ముల గాథలీయధ్యాయమున పొందుపరచడమైనది . విజయానందుడు మద్రాసుప్రాంతపు సన్యాసి,మానససరోవరం వెళ్లదలచి మార్గమధ్యంలో సాయిని సందర్శించాడు . సన్యాసి భవిష్యత్తునెరిగిన బాబ వానిచే భాగవత పారాయణము చేయించారు . ఆపై కొలదిరోజులలోనే సన్యాసి తుదిశ్వాసవిడిచాడు . బాలారాం మాన్కర్ కు 12 రూపాయలిచ్చి వానిని మచ్చింద్రగడ్ కు పంపారు బాబ. అచట ధ్యానంలో భౌతికంగా ప్రత్యక్షమై సర్వవ్యాపిగా యతనికి యనుభవమిచ్చారు.మాన్కరుకు తిరుగుప్రయాణంలో పరిచయంలేని పల్లెటూరివానిరూపంలో సాయపడ్డారు . ఏరూపంలో బాబా వస్తారో భక్తులయుహకందని గుహ్యం ! తుదకు బాబా సాన్నిధ్యంలో చివరిశ్వాస వదలిన మాన్కరు జన్మ సార్ధకమైనది . తాత్యాసాహెబ్ నూల్కర్ బాబాపై మిగులవిశ్వాసం పెంపొందించుకొన్నాడు . తనకుకలిగిన యనుభవములచే తనచివరిరోజులలో శిరిడీలో నివసించి బాబాచెంతనే మరణించాడు . చివరిక్షణంలో బాబాపాదతీర్థం స్వీకరించిన వాని జన్మ ధన్యమై...

శ్రీసాయిసందేశామృతము 30 (Nectar of Sri Sai's message 30.)

Image
శ్రీసాయినాథాయనమః ! శ్రీసాయిబాబ సంకల్పములేక వారినెవ్వరు దర్శింపలేరుగ ! సాయిపిలుపుతో శిరిడీకి లాగబడిన మరోపిచ్చుక వణిలోని సప్తశృంగిదేవి పూజారి కాకాజీ వైద్య . బహుకష్టములపాలైన పూజారి దేవిని ప్రార్ధింప బాబానుదర్శింపమని స్వప్నసందేశమిచ్చినది ఆతల్లి . బాబాయన త్రయంబేశ్వరునిగా తలచి యచటకు వెళ్లి అభిషేకాదులతో పదిరోజులు శివుని పూజించాడు . కాని మునుపటివలె అశాంతి మనస్కుడై మరల ప్రార్ధింప దేవి యాతని శిరిడీసాయిని దర్శింపమని కలలో సూచించినది. దేవీదేవతలు సయితం తమభక్తులను బాబావద్దకు పంపడంద్వారా సాయి శక్తి వ్యక్తమవుతుందిచట. కాని శిరిడికేలావెళ్లాలనేదే మరోపెద్దప్రశ్న . ఈవిషయంలోనూ సాయిమహిమ వెల్లడవుతుంది . సంకల్పం కల్పించిన బాబ ప్రయాణపుఏర్పాట్లు చేయలేరా ? సప్తశృంగిదేవికి బాకీయున్న మొక్కులను స్వీకరింపమని బాబానాశ్రయించిన శ్యామామొక్కుల నంగీకరింపక వణికెళ్లవలసినదిగా నిర్బంచారు సాయి . షిరిడీవెళ్ల మిగుల యాతురతతోయున్న కాకాను శ్యామాకలవడమెంత ఆశ్చ్యర్యకరవిషయం . మొక్కులు దీర్చినయనంతరం శ్యామా కాకాతో కలసి శిరిడీ జేరాడు . బాబానుదర్శించిన పూజారి వైద్య మిగుల ప్రశాంతచిత్తుడయ్యాడు . బాబాతో ఎలాంటి సంభాషణలు, ఆశీసులులేకయే...

శ్రీసాయిసందేశామృతము 29 (Nectar of Sri Sai's message 29.)

Image
శ్రీసాయినాథాయనమః ! సాయిబాబ బహువిధముల వివిధనెపములతో తనభక్తుల శిరిడీ కీడ్చేవారు.ప్రస్తుత అధ్యాయములో మదరాసు భక్తమండలిని పిచ్చుకబృందముగ మార్చి బాబా తమవద్దకు లాగిన వైనం తెలుపబడినది . బాబా కీర్తిప్రతిష్టలు దానధర్మాలగూర్చి విని ధనమాశించి బాబానుదర్శించారు కాశీయాత్రకు వెళ్లే భక్తమండలి . వారంతా మంచి భజనజేశారు. పిదప ఆరతిసమయాన బాబా ఓచిత్రమైన లీలజూపారు. రామభక్తురాలైన భక్తమండలి యజమానిభార్యకు శ్రీరామునిగా దర్శినమిచ్చారు బాబ,ఇతరులు బాబానుమాత్రమే జూశారు . పరమానందాన్నిపొందిన ఆమె తనయనుభవాన్ని భర్తకు వివరించింది . బాబానంతగా విశ్వసించని భర్త ఆమె యనుభవాన్ని భ్రమగా ఆక్షేపించాడు. పిదప ఓ రాత్రి భర్త తాను చెరసాలలో యున్నటుల, బాబాసాయంతో విడుదలైనట్లు కలగన్నాడు . ఈ అనూహ్యఘటనతో యాతనికి కనువిప్పుకలిగి బాబాపై విశ్వాసమేర్పడి భక్తిశ్రద్ధలు కలిగాయి . ఓ అవిశ్వాసి అతి విశ్వాసభక్తునిగా మారిపోయాడు . పిదప బాబా అశీసులతో కాశీయాత్రముగించి క్షేమంగా తమ యిల్లుజేరారు. బొంబాయి నివాసి శ్రీమతి సావిత్రిబాయి టెండూల్కర్ పరివారమంతా సాయిభక్తులు . వైద్యపరిక్షకు హాజరవుతున్న ఆమెపుత్రునికి గ్రహస్థితి బాగుగలేదని జ్యోతిష్యులు నిరాశపరచారు ...

శ్రీసాయిసందేశామృతము 28 (Nectar of Sri Sai's message 28).

Image
శ్రీసాయినాథాయనమః ! సమర్ధసద్గురు సాయిబాబా పిపీలకాది బ్రహ్మపర్యంతము వ్యాపకులు . అంటే భగవద్గీతలో చెప్పబడిన సర్వవ్యాపక ఆత్మయే వారన్నమాట ! ఆత్మకు చావుపుట్టుకలులేవు,పంచభూతములకతీతము . దేహముకన్న మనసుగొప్పది , మనసుకన్నబుద్ధిమిన్న . ఆబుద్దిగూడ ఆత్మచేతనే చేతనత్వమును పొందుచున్నది . సామాన్యమానవుల శక్తియుక్తులు అతిస్వల్పములు . కొందరిది దేహస్థాయి,కొందరిది మనసుస్థాయి , మరికొందరిది బుద్ధిస్థాయి. కాని ఆత్నసాక్షాత్కారము పొందిన మహనీయులు బహుఅరుదు . సాయిబాబా , రామకృష్ణపరమహంస , రమణమహర్షి లాంటి మహనీయులు ఆత్మస్థితిలో విహరించే సమర్ధసద్గురువులు . వారికీ దైవానికి యెలాంటి బేధము కానరాదు . ఆత్మస్థితి అతిబలీయ అయస్కాంతక్షేత్రము . ఆబలిమిచేతనే సాయిబాబా తనభక్తులను అమితంగా ఆకర్షిస్తున్నారు. తనవాడిని తానె తాడుకట్టి పిచ్చుకలా లాగెదనని బాబా స్వయంగా చెప్పారు . సాయిసంకల్పంలేక వారినెవ్వరు దర్శింపలేరు. ప్రస్తుత అధ్యాయంలో బాబా తనవద్దకీడ్చిన కొందరిభక్తుల యనుభవాలు చెప్పబడ్డాయి . మొదటివ్యక్తి లాలా లక్ష్మీచంద్ , బొంబాయినగరంలో ఓ గుమస్తా . 1910వ సంవత్సరంలో వానికి కలిగిన స్వప్నదర్శనం సాయిపిలుపుకు సంకేతం . దాసగణుకీర్తనలో బాబాఫొటో చూ...

శ్రీసాయిసందేశామృతము 27 (Nectar of Sri Sai's message 27).

Image
శ్రీసాయినాథాయనమః ! శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 27. సద్గురుసాయిసమర్థుల నోటినుండి వెలువడిన మాటలే మంత్రాలై భక్తుల రోగముక్తులజేసెడివి. అదిగురువాక్య మహిమ . అదేశక్తి వారి హస్తస్పర్శలోను ప్రవహించేది . వారుతాకిన గ్రంథాలు పవిత్రమయ్యెడివి . కావున భక్తులు పారాయణకుముందు ఎకనాథభాగవతము , గీతారహస్యము మున్నగు గ్రంథాలను బాబాచేతిమీదుగ స్వీకరించేవారు . ప్రస్తుతాధ్యాయ ప్రధానాంశము ప్రసిద్ధ విష్ణుసహస్రనామ గ్రంధముగూర్చి . గ్రంధప్రాముఖ్యతను సన్నిహితభక్తుడు శ్యామాకువివరించి ఆపుస్తకమును తమచేతులుమీదుగా బహూకరించారు. ఆపుస్తకము రామదాసియను వేరొక భక్తునిది . అందులకై యాతడు జగడమాడగ నేర్పుగా సమాధానపరచారు బాబ. దేవనాగరిభాషనెరుగని వాడైనను బాబాదీవెనలచే గ్రంధముచదివి గొప్పప్రావీణ్యము సంపాదించాడు శ్యామా . భక్తులెల్లరు పఠించి ప్రయోజనముపొందవలెననేది బాబాసందేశముగ గ్రహింపగలము . ఈఅధ్యాయములో మరొక ముఖ్యాంశము శ్రీమతి ఖాపర్డే వృత్తాంతము . ఆమె యేడు మాసములు శిరిడీలో బాబానుసేవించిన ధన్యురాలు . అందులకేనేమో బాబా యామెను అంతగా ప్రేమిచేవారు . ఓరోజు ఆమెతెచ్చిన మధ్యాన్న భోజనమును అతిగా యిష్టపడి ఆరగించారు . సమీపానున్న శ్యామ యీపక్షపాతానికి ...

శ్రీసాయిసందేశామృతము 26 (Nectar of Sri Sai Message 26).

Image
శ్రీసాయినాథాయనమః . శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 26. శ్రీసాయిబాబా బోధలలో గురునిపట్ల భక్తిశ్రద్ధలకు అత్యంతప్రాముఖ్యతగలదు. అందులకు వారిగురుసేవయే ప్రబల నిదర్శనము . పంతు యనుభక్తుడు విరారులోని తనగురుని యనుమతితో శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు . కాని పిమ్మట మూర్ఛవచ్చి నేలపై బడ్డాడు . బాబాదయతో కొద్దిసేపటికి తెప్పరిల్లి కళ్లుతెరచాడు . వానిపూర్వాపరాలెరిగిన సర్వజ్ఞుడు బాబా వానితో ఇట్లాన్నారు." ఏమైనను కానిండు పట్టువిడువరాదు . నీగురునియందే ఆశ్రయము నిలుపుము . ఎల్లప్పుడు నిలకడగా నుండుము . ఎప్పుడు వారిధ్యానమునందే మునిగియుండుము". ప్రస్తుత బోధ బాబా భక్తులెల్లరకు వర్తిస్తుంది . తమనుపూజింపమని బాబాయెన్నడు భక్తుల నిర్దేశింపని విషయం మరువరాదు . బొంబాయి నివాసి హరిశ్చంద్ర పితళే పుత్రుడు నయముగాని మూర్ఛవ్యాధితో బాధపడు కొడుకుతో బాబాను ఆశ్రయించాడు . దయామయుడగు బాబా ఆశీసులతో కొంతసేపటికి కుర్రవానికి స్పృహవచ్చి బాగైనాడు . తండ్రి కృతజ్ఞతతో బాబాను పూజించి అచటివారలకు మిఠాయిలు పంచాడు . ఇంటికివెడలు పితళేకు మూడురూపాయలిచ్చి పూజింపమని జెప్పి, అంతకుమునుపు రెండురూపాయలిచ్చామన్నారు . తొలిసారే వచ్చిన యతనికి రెండ...

శ్రీసాయిసందేశామృతము - 25

Image
శ్రీసాయినాథాయనమః . సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము. శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 25. భక్తికి వశుడు , పరవశుడు శ్రీసాయిబాబ. భక్తితీవ్రతకు అనుగుణంగా అనుభవాల ప్రసాదిస్తారు బాబ. భక్తికి గాఢమైన విశ్వాసం పునాదిరాయి . పిందస్థాయిలో రాలిపోక, పరిపక్వతచెందిన ఫలస్థాయివరకు భక్తుడు తన విశ్వాసాన్ని తప్పక కొనసాగించాలి . నమ్మినభక్తుల యోగక్షేమములనెలా బాబా పరిరక్షిస్తారనుటకు చక్కని యుదాహరణము దాము అన్నా కథ . మిత్రులసలహాపై ప్రత్తి ధాన్యవ్యాపారముల జేయదలచిన దాము అన్నాను ఆప్రయత్నమునుండి విరమింపజేసి పెక్కునష్టములనుండి వాని కాపాడారు బాబ. ఈవిషయమై బాబా సలహాకొరకు దాము వ్రాసిన జాబును శ్యామా చదువకమునుపే అందలివిషయమెరిగి వ్యాపారముల విరమింపజేయుట సాయిబాబ సర్వజ్ఞతకు, భక్తులయెడగల ప్రేమకు చక్కని యుదాహరణ . బాబా నివారింపకున్న నానా బహునష్టముల పాలయ్యెడివాడు . ఇద్దరు భార్యలున్నను సంతానహీనుడు దాము. జ్యోతిష్యులు వాని సంతానలేమిని ధృవీకరించారు . కాని బాబా ఆశీసులతో వానికి బహుబిడ్డలు కలిగారు . గ్రహబలాన్ని మించినది బా...